ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anil Ambani: ఆనందంలో ఉన్న అనిల్ అంబానీకి మళ్లీ షాక్.. తన కుమారుడికి కోటి ఫైన్

ABN, Publish Date - Sep 24 , 2024 | 08:09 AM

గత కొన్ని రోజులుగా చాలా బ్యాడ్ ఫేజ్‌లో ఉన్న అనిల్ అంబానీ ఇటివల మళ్లీ ట్రాక్‌లోకి రావడంతో ఆయనతోపాటు వారి ఫ్యామిలీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆయనకు మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Anil Ambani's son Anmol Ambani

ఇటీవల అనిల్ అంబానీ(Anil Ambani)కి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రా రుణాన్ని 85 శాతం తగ్గించిన తరువాత ఈ స్టాక్ భారీగా పెరిగింది. రుణ తగ్గింపు వార్తల నేపథ్యంలో రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ.335కి చేరాయి. మరోవైపు రిలయన్స్ పవర్ షేర్లు కూడా నిరంతర పెరుగుదలతో సోమవారం 52 వారాల గరిష్ట స్థాయి రూ.38.16 వద్ద ముగిశాయి. గత కొన్ని రోజులుగా చాలా బ్యాడ్ ఫేజ్‌లో ఉన్న అనిల్ అంబానీ మళ్లీ ట్రాక్‌లోకి రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగగా, కంపెనీల మార్కెట్ క్యాప్ కూడా పుంజుకోవడంతో అనిల్ అంబానీ ఇంట్లో ఆనందం నెలకొంది. అయితే ఈ క్రమంలోనే ఆయనకు మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది.


కోటి రూపాయల జరిమానా

అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీ(Anmol Ambani)పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(sebi) కోటి రూపాయల జరిమానా విధించింది. సాధారణ ప్రయోజన కార్పొరేట్ రుణాన్ని తగిన శ్రద్ధ లేకుండా ఆమోదించినందుకు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ విషయంలో సెబీ ఈ జరిమానా విధించింది. ఇది కాకుండా రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO) కృష్ణన్ గోపాలకృష్ణన్‌పై సెబీ రూ.15 లక్షల జరిమానా విధించింది. ఇద్దరూ 45 రోజుల్లోగా జరిమానాను డిపాజిట్ చేయాల్సి ఉంటుందని సెబీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


గతంలో రూ.25 కోట్ల ఫైన్

మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో అనిల్ అంబానీ, మరో 24 మందిని సెక్యూరిటీల మార్కెట్ నుంచి ఆగస్టులో సెబీ ఐదేళ్లపాటు నిషేదిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు రూ.25 కోట్ల జరిమానా కూడా విధించారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ డైరెక్టర్ల బోర్డులో ఉన్న అన్మోల్ అంబానీ సాధారణ ప్రయోజన కార్పొరేట్ రుణం లేదా GPCL రుణాన్ని ఆమోదించినట్లు సెబీ తెలిపింది. అలాంటి రుణాన్ని ఆమోదించబోమని కంపెనీ డైరెక్టర్ల బోర్డు స్పష్టం చేసినప్పటికీ ఆయన ఈ పని చేశాడు.


రుణం

ఫిబ్రవరి 14, 2019న, అన్మోల్ అంబానీ అకురా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 20 కోట్ల రుణాన్ని ఆమోదించారు. 2019 ఫిబ్రవరి 11న జరిగిన సమావేశంలో డైరెక్టర్ల బోర్డు ఇకపై GPCL రుణం జారీ చేయవద్దని యాజమాన్యాన్ని ఆదేశించింది. అన్మోల్ అంబానీ కంపెనీకి డైరెక్టర్ అని, ఆయన కోరిక మేరకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని సెబీ నోటీసులో పేర్కొంది. ఆయన తన పాత్రకు మించి పని చేశాడని, అలా చేయడం ద్వారా ఆయన కంపెనీ వాటాదారుల ప్రయోజనాల కోసం కాకుండా తన స్వలాభం కోసం పనిచేశాడని వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 24 , 2024 | 08:18 AM