ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

August Bank Holidays: ఆగస్ట్‌లో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులు అంటే..?

ABN, Publish Date - Aug 01 , 2024 | 01:22 PM

బ్యాంకులకు ప్రతి నెల సెలవులు ఉంటాయి. ఆదివారం, రెండో శనివారం కాకుండా పండగల నేపథ్యంలో బ్యాంకులు పనిచేయవు. బ్యాంకుల సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల విడుదల చేస్తోంది. ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా జాబితా రిలీజ్ చేసింది.

August 2024 Bank Holidays

బ్యాంకులకు ప్రతి నెల సెలవులు ఉంటాయి. ఆదివారం, రెండో శనివారం కాకుండా పండగల నేపథ్యంలో బ్యాంకులు పనిచేయవు. బ్యాంకుల సెలవుల (Bank Holidays) వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల విడుదల చేస్తోంది. ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా జాబితా రిలీజ్ చేసింది. ఇందులో 13 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ వివరాలు తెలుసుకుందాం. పదండి.


ఆగస్ట్ 3వ తేదీ: కేర్ పూజ ఉంటుంది. అగర్తాలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఆగస్ట్ 4వ తేదీ: ఆదివారం

ఆగస్ట్ 8వ తేదీ: టేన్ డాగ్‌ల్హో రమ్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు పనిచేయవు

ఆగస్ట్ 10వ తేదీ: రెండో శనివారం

ఆగస్ట్ 11వ తేదీ: ఆదివారం

ఆగస్ట్ 13వ తేదీ: పేట్రియాట్ డే సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఆగస్ట్ 15వ తేదీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు

ఆగస్ట్ 18వ తేదీ: ఆదివారం

ఆగస్ట్ 19వ తేదీ: రక్షాబంధన్ (ఉత్తరాఖండ్, డామన్ అండ్ డయ్యూ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు)

ఆగస్ట్ 20వ తేదీ: శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకుల పనిచేయవు.

ఆగస్ట్ 24వ తేదీ: నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు

ఆగస్ట్ 25వ తేదీ: ఆదివారం

ఆగస్ట్ 26వ తేదీ: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మెజార్టీ రాష్ట్రాలకు సెలవు


అన్ని రాష్ట్రాలకు కాదు..?

13 రోజులు అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్యాంకులకు సెలవు ఉండదు. ఆయా రాష్ట్రాల పండుగల నేపథ్యంలోనే సెలవు ఇచ్చారు. బ్యాంకులకు సెలవు ఉన్నప్పటీకి ఆన్ లైన్‌లో సేవలు అందుబాటులో ఉంటాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవచ్చు. ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.


Read More Business News
and Latest Telugu News

Updated Date - Aug 01 , 2024 | 01:22 PM

Advertising
Advertising
<