Bajaj Housing Finance IPO: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకు భారీ స్పందన.. 4 గంటల్లోనే ఫుల్ సబ్‌స్క్రిప్షన్..
ABN, Publish Date - Sep 09 , 2024 | 02:24 PM
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మెగా ఐపీఓకు మదుపర్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ ఐపీఓకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఐపీఓ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే సబ్‌స్క్రిప్షన్ దాదాపు పూర్తయింది. రూ.6, 560 కోట్లను మార్కెట్ నుంచి సమీకరించాలనే లక్ష్యంతో ఈ ఐపీఓ ప్రారంభమైంది.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (Bajaj Housing Finance) మెగా ఐపీఓకు మదుపర్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ ఐపీఓకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఐపీఓ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే సబ్‌స్క్రిప్షన్ దాదాపు పూర్తయింది. రూ.6, 560 కోట్లను మార్కెట్ నుంచి సమీకరించాలనే లక్ష్యంతో ఈ ఐపీఓ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్‌ఐఐ కోటా దాదాపు 1.95 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ కోటా కూడా దాదాపు 85 శాతం సబ్‌స్క్రైబ్ అయింది (Bajaj Housing Finance IPO ).
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో 68 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా ఇప్పటికి దాదాపు 59 కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. ఈ ఐపీఓలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక్కో షేరు ధరను రూ.66 -70 శ్రేణి మధ్యలో కంపెనీ నిర్ణయించింది. ఈ ఐపీఓలో భాగంగా మదుపర్లు కనీసం 214 షేర్లతో కూడా ఒక లాట్‌కు బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ సెప్టెంబర్ 11వ తేదీన ముగియబోతోంది. 12వ తేదీన మదుపర్లకు షేర్లను అలాట్ చేస్తారు. 13వ తేదీన డీమాట్ అకౌంట్‌లోకి షేర్లు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. 16వ తేదీన స్టాక్ మార్కెట్లలో షేర్లు లిస్టింగ్ జరుగుతుంది.
తాజా ఐపీఓలో భాగంగా రూ.3,560 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేశారు. అలాగే మాతృసంస్థ అయిన బజాజ్ ఫైనాన్స్ రూ.3 వేల కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తోంది. కాగా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1731 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఏడాది లాభం (రూ.1258)తో పోలిస్తే 38 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి..
54th GST Council Meeting: నేడు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. బీమాతోపాటు కీలక అంశాలపై నిర్ణయం
Next Week IPOs: ఈ వారం ఐపీఓల పండుగ.. పెట్టుబడిదారులకు డబ్బే డబ్బు!
Money Saving Plan: రిటైర్ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 09 , 2024 | 02:24 PM