ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bank Holidays: జూన్‌లో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులు..?

ABN, Publish Date - May 27 , 2024 | 04:57 PM

ప్రతి నెలలాగే జూన్‌లోనూ బ్యాంకుసెలవులు(Bank Holidays June 2024) ఉన్నాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు సహా జూన్‌లో 12 రోజులు బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి నెలలాగే జూన్‌లోనూ బ్యాంకుసెలవులు(Bank Holidays June 2024) ఉన్నాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు సహా జూన్‌లో 12 రోజులు బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

జూన్ 9: హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా బ్యాంకులు క్లోజ్ అయి ఉంటాయి.

జూన్ 10: పంజాబ్‌లో శ్రీ గురు అర్జున్ దేవ్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సెలవు.

జూన్ 14: రుతుపవనాల ఆగమనాన్ని పురస్కరించి నిర్వహించే పహిలి రాజా కార్యక్రమం కోసం ఈ తేదీన ఒడిశాలోని బ్యాంకులు మూసివేస్తారు.

జూన్ 15: ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో బ్యాంకులు YMA డే(Young Mizo Association) కోసం మూసేస్తారు.

జూన్ 17: బక్రీద్ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు.

జూన్ 21: వట్ సావిత్రి వ్రతం ఉండటంతో ఈ తేదీన అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్ అయి ఉంటాయి.

వారాంతపు బ్యాంకు సెలవులు


జూన్ 8: రెండో శనివారం కావడంతో బ్యాంకులు మూసేసి ఉంటాయి.

జూన్ 22: నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి.

జూన్ 2, 9, 16, 23, 30: ఆదివారం బ్యాంకులకు సెలవులు

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు..

ఆయా తేదీల్లో బ్యాంకులు మూసేసినప్పటికీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తూనే ఉంటాయి. కస్టమర్‌లు తక్షణ అవసరాల కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు లేదా ATMల ద్వారా లావాదేవీలు జరపవచ్చు. అయితే బ్యాంకు హాలీడేలను గుర్తించుకుని.. ఆయా తేదీల్లో పనులను వాయిదా వేసుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 27 , 2024 | 04:57 PM

Advertising
Advertising