Bank Holidays March 2024: మార్చి 2024లో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా..చూసుకుని వెళ్లండి
ABN , Publish Date - Feb 26 , 2024 | 12:47 PM
బ్యాంకింగ్‌కు సంబంధించి మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉందా. అయితే మీరు వెళ్లే ముందు మార్చిలో ఖచ్చితంగా సెలవుల జాబితాను తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే బ్యాంక్ సెలవులు ఉన్నప్పుడు మీరు వెళితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
బ్యాంకింగ్‌కు సంబంధించి మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉందా. అయితే మీరు వెళ్లే ముందు మార్చిలో ఖచ్చితంగా సెలవుల(Bank Holidays) జాబితాను తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే బ్యాంక్ సెలవులు ఉన్నప్పుడు మీరు వెళితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లో జరిగే అనేక పండుగల సెలవులు కాకుండా, శని, ఆదివారం సెలవులు కూడా ఇందులో ఉన్నాయి. ఆ సెలవుల వివరాలను ఇప్పుడు చుద్దాం.
మార్చిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మార్చి(march)లో మొదటి సెలవుదినం మార్చి 1వ తేదీన. మిజోరంలో మార్చి 1న చాప్‌చార్ కుత్ పండుగ ఉంది. అదేవిధంగా హోలీతో పాటు, రంజాన్ ప్రారంభం రోజు మార్చి 12న చాలా ప్రాంతాల్లో సెలవు ఉంటుంది. స్థానిక పండుగలను దృష్టిలో ఉంచుకుని సెలవులు నిర్ణయించబడతాయి. కాబట్టి ఈ సెలవులు ప్రతి రాష్ట్రానికి మారే అవకాశం ఉంటుంది. RBI మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఆదివారం, రెండవ, నాల్గవ శనివారాలు మూసివేయబడతాయి.
మార్చి 2024(march 2024)లో బ్యాంకు సెలవుల జాబితా
మార్చి 1, శుక్రవారం, చాప్‌చార్ కుత్ పండుగ (మిజోరాం)
మార్చి 3, ఆదివారం, వారాంతపు సెలవు
మార్చి 8, శుక్రవారం, మహాశివరాత్రి సెలవు
మార్చి 9, శనివారం, రెండవ శనివారం సెలవు
మార్చి 10, ఆదివారం, వారాంతపు సెలవు
మార్చి 17, ఆదివారం, వారాంతపు సెలవు
మార్చి 22, శుక్రవారం, బిహార్ డే (బిహార్) సెలవు
మార్చి 23, శనివారం, నాలుగో శనివారం సెలవు
మార్చి 24, ఆదివారం, వారాంతపు సెలవు
మార్చి 25, సోమవారం, హోలీ (2వ రోజు) ధూలేటి/డోల్ జాత్రా/ధులంది పలు రాష్ట్రాల్లో సెలవు
మార్చి 26, మంగళవారం, 2వ రోజు/హోలీ ఒడిశా, మణిపూర్, బీహార్ రాష్ట్రాల్లో సెలవు
మార్చి 27, బుధవారం, హోలీ బిహార్‌లో సెలవు
మార్చి 29, శుక్రవారం, గుడ్ ఫ్రైడే పలు రాష్ట్రాల్లో సెలవు
మార్చి 31, ఆదివారం, వారాంతపు సెలవు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Yohan Poonawalla: క్వీన్ ఎలిజబెత్ 2 రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసిన భారతీయ వ్యాపారవేత్త.. ధర ఏంతంటే