ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bank Loan: బ్యాంక్‌లోన్‌ రిజెక్ట్‌ అయ్యిందా? ఇలా చేయండి..

ABN, Publish Date - Jan 09 , 2024 | 07:51 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజల తమకంటూ ఓ ఇల్లు, సొంత వాహనం ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే.. తమ వద్ద డబ్బుతో పాటు.. కొంత మొత్తంలో లోన్ తీసుకుని మరీ ఇళ్లు కట్టుకోవడం, సొంతంగా వాహనం కొనుగోలు చేయడం చేస్తున్నారు. మంచి శాలరీ వచ్చే వారికి లోన్ చాలా ఈజీగా లభిస్తుంది. అయితే, లోన్ పొందడం అందరికీ సులువు కాదనేది కూడా నిజం.

Bank Loan Tips

Bank Loan Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజల తమకంటూ ఓ ఇల్లు, సొంత వాహనం ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే.. తమ వద్ద డబ్బుతో పాటు.. కొంత మొత్తంలో లోన్ తీసుకుని మరీ ఇళ్లు కట్టుకోవడం, సొంతంగా వాహనం కొనుగోలు చేయడం చేస్తున్నారు. మంచి శాలరీ వచ్చే వారికి లోన్ చాలా ఈజీగా లభిస్తుంది. అయితే, లోన్ పొందడం అందరికీ సులువు కాదనేది కూడా నిజం. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం పెద్ద సవాల్‌గా మారుతోంది. కొందరికి ఎంత ప్రయత్నించినా అప్పు దొరకడం కష్టం అవుతుంది. అన్నీ సవ్యంగా ఉన్నాయని భావించినా.. బ్యాంకులు లోన్ అప్లికేషన్స్‌ని తిరస్కరిస్తున్నాయి. మరి లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురైతే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం..

వాస్తవానికి లోన్ రిక్వెస్ట్ రిజెక్ట్ అవడానికి చాలా కారణాలుంటాయి. అంతకు ముందు తీసుకున్న రుణాల చెల్లింపు తీరు, ఆదాయాన్ని మించిన అప్పుల్లాంటివి ఈ కారణాల్లో ప్రధానంగా చెప్పుకోవచ్చు. రుణ దరఖాస్తులు తిరస్కరించిన వెంటనే కొందరు మళ్లీ కొత్తగా వేరే బ్యాంకులో అప్లై చేసుకుంటారు. అయితే, దానికంటే ముందు మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ లోన్ రిక్వెస్ట్‌ను బ్యాంకు ఎందుకు తిరస్కరించిందో కారణం తెలుసుకోవాలి. రుణాలు ఇచ్చే బ్యాంకులు ఈ విషయాన్ని తప్పక తెలియజేస్తాయి.

లోన్ రిజెక్ట్‌కు కారణాలివే..

క్రెడిట్ స్కోర్ 700 పాయింట్ల లోపు ఉన్నప్పుడు లోన్ అప్లికేషన్‌ను బ్యాంకులు దాదాపు ఆమోదించవు. అలాగే, తగినంత ఆదాయం లేకపోవడం, ఇప్పటికే ఉన్న రుణాల వాయిదాలు మీ ఆదాయంలో 50-60 శాతానికి చేరడం, ఇప్పటికే చెల్లించాల్సిన ఈఎంఐలను ఆలస్యంగా చెల్లించడం, క్రెడిట్ రిపోర్ట్‌లో తప్పుడు వివరాలు, ఉద్యోగపరమైన అంశాలు లోన్ రిజెక్ట్ చేయడానికి కారణాలుగా ఉంటాయి.

ఈ తప్పులు చేయొద్దు..

👉 మీరు ఇప్పటికే లోన్ తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తున్నట్లయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈఎంఐలను వాయిదా వేయొద్దు. ఈఎంఐలను సకాలంలో చెల్లించాలి. ఇక 750కి మించి క్రెడిట్ స్కోర్ ఉంటే ఏ బ్యాంకు అయినా లోన్‌ను ఈజీగా ఆమోదిస్తుంది. ఒకవేళ క్రెడిట్ స్కోర్ 750కి తక్కువగా ఉంటే.. లోన్ దాదాపు రాదు. ఒకవేళ మీరు లోన్‌ను తీసుకోవాలనుకుంటే.. ముందుగా మీ క్రెడిట్ స్కోర్ పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అప్పులను పూర్తి చెల్లించే ప్రయత్నం చేయండి. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.

👉 లోన్ తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లయితే.. ఆ దరఖాస్తులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా.. వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటివి వివరాలు అన్నీ సరిగా ఉండేలా చూసుకోవాలి. ఏ చిన్న పొరపాటు ఉన్నా లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.

👉 కొందరు తరచుగా లోన్ కోసం ట్రై చేస్తుంటారు. కానీ, పొరపాటున కూడా అలా చేయొద్దు. ముఖ్యంగా పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల కోసం ప్రయత్నిస్తారు. ఇలా అడగటం వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే.. లోన్ కోసం సాధ్యమైనంత తక్కువ అప్లికేషన్స్ పెట్టుకోండి.

👉 క్రెడిట్ స్కోర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే.. దానిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. లోన్ ఈఎంఐలను, క్రెడిట్ కార్డ్ ఈఎంఐలను టైమ్ టు టైమ్ చెల్లించండి. ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ క్రమంగా పెరుగుతుంది.

Updated Date - Jan 09 , 2024 | 07:51 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising