Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:47 AM
మీరు పెరిగిన రీఛార్జ్ ధరలతో విసిగి పోయారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే మీకు ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌ల నుంచి ఉపశమనం కలిగించడానికి BSNL చౌక ప్లాన్‌లను ప్రారంభించింది. దీనిలో మీకు 5 నెలలకుపైగా ఉన్న ప్లాన్ ధర వెయ్యిలోపు ఉండటం విశేషం.
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్లాన్‌ల ధరలను పెంచడంతో అనేక మంది ప్రజలు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో BSNL కూడా దేశంలో తన నెట్‌వర్క్‌ను చాలా వేగంగా విస్తరిస్తోంది. BSNL తక్కువ ధరకు ఎక్కువ చెల్లుబాటును అందించే రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే తన వినియోగదారుల కోసం సంస్థ 997 రూపాయల శక్తివంతమైన రీఛార్జ్ ప్లాన్‌ను ఇటివల ప్రకటించింది.
160 రోజుల వ్యాలిడిటీ
ఈ ప్లాన్‌లో కంపెనీ వినియోగదారులకు 160 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే మీరు రూ. 1,000 కంటే తక్కువ ధరతో 5 నెలల కంటే ఎక్కువ కాలం రీఛార్జ్ చేసే అవాంతరాల నుంచి విముక్తి పొందుతారు. దీంతో BSNL ఏ నెట్‌వర్క్‌లోనైనా 160 రోజుల పాటు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు.
BSNL రూ 997 ప్లాన్
రూ. 997 ప్లాన్‌లో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, రోజువారీ 100 ఉచిత SMS, ప్రతిరోజూ 2GB హై స్పీడ్ డేటా అందించబడుతుంది. ఈ ప్లాన్ 160 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కాలింగ్, డేటా సేవలు రెండింటికీ అవసరమయ్యే వినియోగదారులకు ఇది ఉత్తమమైనదని చెప్పవచ్చు.
గత కొన్ని నెలల్లో ప్రభుత్వ సంస్థ BSNLలో లక్షల మంది కొత్త వినియోగదారులు చేరారు. Jio, Airtel, Vi ధరల పెంపు నేపథ్యంలో BSNL నేరుగా లాభపడింది. దీంతో కస్టమర్లను మరింత ఆకర్షించడానికి, BSNL ఇటీవల అనేక రకాల సేవలను ప్రారంభించింది. ఇది కాకుండా కంపెనీ 4G నెట్‌వర్క్ కోసం కూడా వేగంగా పని చేస్తోంది.
BSNL రూ 999 ప్లాన్ కూడా..
అంతేకాదు BSNL ఈ రీఛార్జ్ ప్లాన్ 200 రోజుల వాలిడిటీ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. ఇది కాల్స్ మాత్రమే చేసుకోవడానికి మంచి ఎంపిక. అయితే ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ డేటా సౌకర్యం అందుబాటులో లేదు. ప్రధానంగా కాలింగ్ ప్లాన్‌ల కోసం చూసే వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ ధర రూ.999కి లభిస్తుంది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అన్ని టెలికాం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్ కవరేజీకి సంబంధించిన సమాచారాన్ని జియోస్పేషియల్ మ్యాప్‌ల ద్వారా ప్రచురించేలా చూసుకోవాలని ఆదేశించింది. ఈ మ్యాప్‌లలో 2G, 3G, 4G, 5G సేవల లభ్యతను స్పష్టంగా చూపించడం తప్పనిసరి అని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
BSNL: మరో అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. 90 రోజులకు చెల్లించేది కేవలం..
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Nov 29 , 2024 | 11:54 AM