ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Budget 2024: జై విజ్ఞాన్‌, జై కిసాన్‌, జై అనుసంధాన్‌ మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం!

ABN, Publish Date - Feb 01 , 2024 | 12:25 PM

జై విజ్ఞాన్‌, జై కిసాన్‌, జై అనుసంధాన్‌ అన్నది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు.

జై విజ్ఞాన్‌, జై కిసాన్‌, జై అనుసంధాన్‌ అన్నది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు. నూతన పరిజ్ఞానం, మార్కెట్‌ వ్యవస్థ అనుసంధానంతో వ్యవసాయరంగాలకు కొత్త ఆదాయ మార్గాలు వచ్చాయని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు, వృథాను అరికట్టి రైతులకు అధిక ఆదాయం సమకూర్చే పథకాలు కూడా చేపడుతున్నట్లు చెప్పారు. దీంతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల కోసం గిడ్డంగులు, ప్రాసెసింగ్‌ కోసం ఆర్థిక సాయం, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు కొత్త పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు.


ఈ క్రమంలో వాస్తవ ఆదాయం క్రమంగా పెరిగి సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందని కేంద్ర మంత్రి అన్నారు. దీంతోపాటు 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు. పాడి అభివృద్ధి కోసం రైతులకు, రాష్ట్రీయ డెయిరీ ప్రాసెసింగ్‌, గోకుల్‌ మిషన్‌ ద్వారా డెయిరీ ప్రాసెసింగ్‌కు, దేశీయ మత్స్య సంపద అభివృద్ధికి పీఎం మత్స్య సంపద యోజన ద్వారా మరింత ఆర్థిక సాయం అందించినట్లు నిర్మల చెప్పారు.

Updated Date - Feb 01 , 2024 | 12:25 PM

Advertising
Advertising