Budget 2024: వీరికి 50 ఏళ్లపాటు వడ్డీలేని రుణాలు..అదిరిపోయే ప్రకటన
ABN, Publish Date - Feb 01 , 2024 | 06:19 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో యువత, టెక్ రంగ నిపుణులు, కంపెనీలకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. సాంకేతిక రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో లక్ష కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో యువత, టెక్ రంగ నిపుణులు, కంపెనీలకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. సాంకేతిక రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో లక్ష కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది దీర్ఘకాలికంగా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు చేసే సంస్థలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Flipkart: ఫ్లిప్‌కార్ట్ నుంచి క్రేజీ అప్‌డేట్.. ఈ కస్టమర్లకు గుడ్‌న్యూస్!
మరోవైపు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 43 కోట్ల మంది రుణాలు పొందారని కేంద్ర మంత్రి తెలిపారు. దీని వల్ల యువతలో వ్యవస్థాపకత పెరిగిందని అన్నారు. దీంతోపాటు స్టార్టప్‌లకు పన్ను మినహాయింపు కూడా ఏడాది పాటు పొడిగించారు. ఈ సందర్భంగా పరిశోధన, ఆవిష్కరణలను గణనీయంగా పెంచడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు నిర్మల చెప్పారు.
దీంతోపాటు రక్షణ అవసరాల కోసం డీప్‌టెక్‌ని అభివృద్ధి చేసేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. సవరించిన పథకం కింద భారతదేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించిందని నిర్మల అన్నారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 1.4 కోట్ల మంది యువతకు ఇచ్చామని, 54 లక్షల మంది యువతకు నైపుణ్యం పెంచిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
Updated Date - Feb 01 , 2024 | 06:19 PM