ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Budget 2024: ఈ స్టాక్‌లలో పెరుగుదల ఉంటుందా... పెట్టుబడి పెట్టాలా వద్దా?

ABN, Publish Date - Jan 26 , 2024 | 03:16 PM

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే మదుపర్లు బడ్జెట్ 2024 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దాదాపు ప్రతి ఏడాది బడ్జెట్(Budget 2024) సమయంలో స్టాక్ మార్కెట్లలో పలు రకాల స్టాక్స్ పెద్ద ఎత్తున పుంజుకుంటాయి. ఆ క్రమంలో పెట్టుబడిదారులకు మంచి లాభాలు లభిస్తాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏ స్టాక్స్ లాభాల్లో దూసుకెళ్తాయి. ఏవి నష్టాల్లో ఉంటాయనేది ఇప్పుడు చుద్దాం.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే మదుపర్లు బడ్జెట్ 2024 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దాదాపు ప్రతి ఏడాది బడ్జెట్ సమయంలో స్టాక్ మార్కెట్లలో పలు రకాల స్టాక్స్ పెద్ద ఎత్తున పుంజుకుంటాయి. ఆ క్రమంలో మదుపర్లు మంచి లాభాలను పొందుతారు. గత ఏడాది బడ్జెట్‌(Budget 2024)లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూలధన వ్యయంపై పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. దాని ప్రభావం పారిశ్రామిక షేర్లపై కనిపించింది.

బీహెచ్ఈఎల్, సీమెన్స్, ఎల్ అండ్ టీ, ఏబీబీ వంటి కంపెనీలకు ఆర్డర్ బుక్ పెరిగింది. దీంతో గత ఏడాది కాలంలో బీఎస్ఈ ఇండస్ట్రియల్ ఇండెక్స్ 65 శాతం రాబడులను ఇచ్చింది. ఈ కాలంలో ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, ఏబీబీ వంటి కంపెనీల షేర్లు 32 నుంచి 166 శాతం మేర పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న మద్యంతర బడ్జెట్ కారణంగా పారిశ్రామిక స్టాక్స్ సహా మరికొన్నింటిలో ర్యాలీ కొనసాగుతుందా లేదా అనే అంచనాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Electric Luna: వావ్ ఎలక్ట్రిక్ లూనా వస్తుందోచ్..ఎప్పటి నుంచంటే


ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బ‌డ్జెట్‌లో ప్రకటనల వ‌ల్ల ఇండ‌స్ట్రియ‌ల్ షేర్లలో పెరుగుదల ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్ కావడమే అందుకు కారణమని అంటున్నారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పారిశ్రామిక కంపెనీలు బలహీనంగా ఉంటాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ నుంచి స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక నిపుణులు.

అయితే జూలైలో వచ్చే పూర్తి బడ్జెట్‌లో భారీ ప్రకటనలు చేయనున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభావం చూపదని అంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్‌ వాహనాల సబ్సిడీ విషయంలో ఈ బడ్జెట్‌లో ఏదైనా ప్రకటన రావచ్చని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. దీంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలపై పన్ను తగ్గించడం సహా ఇతర అంశాలపై కూడా ప్రకటనలు రానున్నాయి. ఈ క్రమంలో రక్షణ, ఆటోమొబైల్, ప్యాకేజింగ్, బీమా సహా పలు ఐటీ స్టాక్స్ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Updated Date - Jan 26 , 2024 | 03:16 PM

Advertising
Advertising