ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Business : కెనరా బ్యాంక్‌లో అధికార, కన్నడ భాషలకు ప్రాధాన్యత

ABN, Publish Date - Aug 03 , 2024 | 05:59 AM

కెనరా బ్యాంక్‌లో అధికారిక భాష హిందీతో పాటు కన్నడ భాషకు ప్రాధాన్యత ఇచ్చామని బ్యాంక్‌ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు తెలిపారు. శుక్రవారం నాడిక్కడ కెనరా బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో అధికారిక భాష అమలు కమిటీ (బ్యాంకులు, బీమా సంస్థలు), బెంగళూరు ....

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కెనరా బ్యాంక్‌లో అధికారిక భాష హిందీతో పాటు కన్నడ భాషకు ప్రాధాన్యత ఇచ్చామని బ్యాంక్‌ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు తెలిపారు. శుక్రవారం నాడిక్కడ కెనరా బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో అధికారిక భాష అమలు కమిటీ (బ్యాంకులు, బీమా సంస్థలు), బెంగళూరు ఆధ్వర్యంలో జరిగిన 77వ అర్ధ వార్షిక కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంక్‌ అధికారిక కార్యకలాపాల్లో అధికార భాష హిందీ, కన్నడ భాషలను గరిష్ఠంగా వినియోగించేలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. భాషా అమలు కమిటీ ద్వారా చైతన్యం కలిగిస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ ఈడీ అశోక్‌ చంద్ర, రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ సోనాలిసేన్‌ గుప్తా సహా వివిధ బ్యాంకులు, బీమా సంస్థల ప్రాంతీయ అధికారులు, కమిటీ దక్షిణ భారత విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ అనిర్బన్‌ కుమార్‌ పాల్గొన్నారు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అధికారిక భాష అమలుకు సంబంధించి రాజభాష పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రయాస్‌ 49వ సంచికను విడుదల చేశారు.

Updated Date - Aug 03 , 2024 | 05:59 AM

Advertising
Advertising
<