Chennai: తగ్గిన బంగారం ధర.. దుకాణాలకు పోటెత్తిన జనం
ABN, Publish Date - Jul 25 , 2024 | 01:21 PM
బంగారం ధరలు(Gold prices) తగ్గడంతో నగల కొనుగోలుకు ప్రజలు ఎగబడుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా బంగారం దుకాణాలు క్రిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఒక్కరోజులోనే 15 శాతం వరకు విక్రయాలు పెరిగినట్లు నిర్హాకులు చెబుతుండడం విశేషం.
- 15 శాతం పెరిగిన విక్రయాలు
చెన్నై: బంగారం ధరలు(Gold prices) తగ్గడంతో నగల కొనుగోలుకు ప్రజలు ఎగబడుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా బంగారం దుకాణాలు క్రిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఒక్కరోజులోనే 15 శాతం వరకు విక్రయాలు పెరిగినట్లు నిర్హాకులు చెబుతుండడం విశేషం. కేంద్ర విత్తమంత్రి దాఖలు చేసిన బడ్జెట్లో బంగారం దిగుమతి సంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా బంగారం ధర గణనీయంగా తగ్గింది. గత ఏడాది జూలై నెలలో సవరం బంగారం రూ.44 వేలు పలికింది. ఈ ధర మరింత పెరిగి ఈ నెల 19వ తేది రూ.55 వేలకు చేరింది.
ఒకే ఏడాదిలో సవరం బంగారం రూ.11 వేలకు పెరగడంతో, సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయినా వివాహం, విశేష రోజుల్లో బంగారం కొనుగోలు చేయాల్సి రావడంతో వారిపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం పార్లమెంటులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Union Minister Nirmala Sitharaman) దాఖలు చేసిన బడ్జెట్‌లో, బంగారు దిగుమతి సుంకం తగ్గించడంతో ఒకేసారి బంగారం నేలకు దిగొచ్చింది. ఈ నేపథ్యంలో, బుధవారం కూడా బంగారం రూ.480 తగ్గి, సవరు రూ.51,920కి విక్రయమైంది.
దీంతో, నగరంలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి. అదే సమయంలో, వెండి దిగుమతుల సుంకం కూడా 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గడంతో, రెండు రోజుల్లో కిలోకు రూ.4 వేలు తగ్గింది. అలాగే, ప్లాటినం దిగుమతులపై సుంకం 15.4 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గడంతో వాటి ధరలు కూడా తగ్గాయి. దీంతో, బంగారు ఆభరణాలతో(Gold jewelry) పాటు వెండి వస్తువులు, ప్లాటినమ్ ఆభరణాలు కొనేందుకు కూడా వినియోగదారులు ఆసక్తి చూపారు.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Updated Date - Jul 25 , 2024 | 01:21 PM