ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

China: చైనా రక్షణ బడ్జెట్ భారీగా పెంపు.. భారత్ కంటే ఎన్ని రెట్లో తెలుసా?

ABN, Publish Date - Mar 05 , 2024 | 11:10 AM

చైనా సైన్యాన్ని ఆధునీకరించే విషయంలో భారత్ కంటే పెద్ద ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే చైనా రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచేసింది. అయితే ఎంత పెంచిందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.

గత కొంత కాలంగా భారత్(Bharat), చైనా(china) సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్ని విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఇరు దేశాల సైనికుల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా చైనా సైన్యాన్ని ఆధునీకరించే విషయంలో భారత్ కంటే పెద్ద ముందడుగు వేసింది. చైనా రక్షణ బడ్జెట్‌(Chinas Defense Budget)ను భారీగా పెంచేసింది. ఎంతలా అంటే ఇది భారతదేశ రక్షణ బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. 2024 ఏడాదికి గాను భారతదేశ రక్షణ బడ్జెట్ రూ.6,21,541 కోట్లు కాగా.. ఇక చైనాది బడ్జెట్ దాదాపు 232 బిలియన్ డాలర్లుగా(రూ.192,36,41,92,00,000) ప్రకటించారు. ఇది భారతదేశ బడ్జెట్ కంటే చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్(xi jinping) తన ఆర్మీ PLAని ఆధునీకరించాలని 2027ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్, జపాన్ సహా పలు దేశాలతో చైనా వివాదాలను కొనసాగిస్తోంది. అదే సమయంలో సరిహద్దు వివాదం కారణంగా భారతదేశం(india)తో చైనా సంబంధాలు సంక్లిష్ట దశను ఎదుర్కొంటోంది. చైనా నౌకాదళంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండగా.. ప్రస్తుతం చైనా నౌకాదళం నౌకల పరంగా ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఉంది.


హిందూ మహాసముద్రంలోని అనేక దేశాలలో చైనా స్థావరాలను ఏర్పాటు చేసింది. మరోవైపు సైనికుల సంఖ్య పరంగా కూడా చైనా సైన్యం అతిపెద్దది. చైనా తన రాకెట్ బలగాన్ని నిశబ్దంగా విస్తరిస్తోందన్న ఆరోపణలున్నాయి. చైనా రక్షణ బడ్జెట్(Chinas Defense Budget) నివేదికల కంటే చాలా ఎక్కువగా ఉందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే చైనా తన సైనిక పరిశోధన, అభివృద్ధి బడ్జెట్‌ను రక్షణ బడ్జెట్‌లో చేర్చలేదు.

ఇక చైనా ప్రాబల్యం పెరగడంపై అమెరికా(america) కూడా ఆందోళన చెందుతోంది. రక్షణ బడ్జెట్‌లో అమెరికా ఇప్పటికీ చైనా కంటే చాలా ముందుంది. గత ఏడాది అమెరికా రక్షణ బడ్జెట్ 886 బిలియన్ డాలర్లు. చైనా నుంచి పెరుగుతున్న సవాలును దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా, బ్రిటన్ సైన్యాన్ని బలోపేతం చేయడంలో అమెరికా బిజీగా ఉంది. అదే సమయంలో అమెరికా కూడా భారత్‌(india)తో వ్యూహాత్మక సహకారాన్ని పెంచుకుంటోంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Elon Musk: ఎలాన్ మస్క్‌పై వెయ్యి కోట్ల దావా వేసిన నలుగురు..అసలేమైంది?

Updated Date - Mar 05 , 2024 | 11:18 AM

Advertising
Advertising