ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:11 PM

ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ధనవంతులు కావాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే వీటిని అచరించి, అనుసరిస్తారు. అయితే మీరు కూడా ప్రతిరోజు కొద్దిగా డబ్బు ఆదా చేసి కోటీశ్వరులు కావడం ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

daily You can save Rs 100

ఆర్థికంగా స్వాతంత్ర్యం పొందాలంటే మాత్రం తప్పనిసరిగా పొదుపు(savings) అలవాటు చేసుకోవాలి. అందుకోసం భారీ మొత్తాలు అవసరం లేదు. రోజుకు కేవలం 100 రూపాయలతో కూడా పొదుపును ప్రారంభించవచ్చు. ఇలా చేయడం ద్వారా కూడా మీరు కోటీశ్వరులు కావచ్చు. అవును మీరు విన్నది నిజమే. అయితే అందుకోసం ఎన్నేళ్ల సమయం పడుతుంది. ధనవంతులు కావడానికి ఎలాంటి ఫార్ములా అప్లై చేయాలి. దేనిలో పెట్టుబడులు(investments) పెట్టాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


కేవలం రూ.100

ప్రస్తుత డిజిటల్ యుగంలో పెద్ద ఫండ్‌ను సృష్టించడం అంత కష్టమైన పనేమి కాదు. ప్రజలు ప్రతిరోజు కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా వారి తమ డబ్బును రెండింతలు, మూడు రెట్లు పెంచుకోవచ్చు. ఈ క్రమంలో మీరు స్టాక్ మార్కెట్ రిస్కును నివారించాలనుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. వీటిలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ప్రతిరోజూ కేవలం రూ. 100 పెట్టుబడి చేయడం ద్వారా మీరు కోటీశ్వరులు కావచ్చు.


ఎంత టైం

ఈ క్రమంలో మీరు మిలయనీర్ కావాలనుకుంటే రోజూ రూ. 100 ఆదా చేశారనుకుందాం. అంటే అది నెలకు రూ. 3000 అవుతుంది. ఇప్పుడు మీరు రూ. 3000ని మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడిగా పెట్టండి. ఆ విధంగా మీరు 30 సంవత్సరాల పాటు అదే మొత్తంలో పెట్టుబడి చేస్తే 30 సంవత్సరాలలో మీరు ఆ పెట్టుబడి మొత్తం రూ.10,80,000 అవుతుంది. సిప్ విధానంలో మీకు సాధారణంగా రిటర్న్స్ 12 నుంచి 19 శాతం వరకు లభిస్తాయి. ఈ నేపథ్యంలో మీరు 12% రాబడిని పొందినట్లయితే, 30 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే మొత్తం రూ.1,05,89,741 అవుతుంది. మీకు వడ్డీ రూపంలోనే రూ.95,09,741 వస్తుంది.


రెండు కోట్లు కూడా..

ఒక వేళ మీకు 15 శాతం చొప్పున రిటర్న్స్ వస్తే మీకు వచ్చే మొత్తం రూ. 2,10,29,462 అవుతుంది. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ డబ్బును అనేక రెట్లు పెంచుకోవచ్చు. మిలియనీర్ కావాలనే మీ కలను సులభంగా నెరవేర్చుకోవచ్చు. మీరు ఈ పెట్టుబడిని 30 సంవత్సరాల వయస్సులోపు ప్రారంభిస్తే సులభంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నుంచి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) తీసుకోవడం. పదవీ విరమణ వరకు మీకు వచ్చే డబ్బు అనేక రెట్లు అవుతుంది.

గమనిక: సిప్ అనేది మీరు దీర్ఘ కాలం పాటు డబ్బును డిపాజిట్ చేసే మ్యూచువల్ ఫండ్ స్కీం. మీరు దీనిలో పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారున్ని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.


ఇవి కూడా చదవండి:

Next Week IPOs: ఈ వారం మార్కెట్లోకి రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..

Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 16 , 2024 | 12:18 PM

Advertising
Advertising