ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసా? ఏటీఎంలల్లో యూపీఐ యాప్స్ సాయంతో..

ABN, Publish Date - Aug 31 , 2024 | 09:22 AM

ఏటీఎంలల్లో డెబిట్ కార్డు లేకున్నా యూపీఐ సాయంతో కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్లల్లో డబ్బులు డిపాజిట్ చేసుకునే సౌలభ్యం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ రాకతో చెల్లింపులు ఎంత సులభతరం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నానాటికీ వీటి వినియోగం పెరుగుతుండటంతో ప్రభుత్వం యూపీఐ చెల్లింపులకు పలు అదనపు ఫీచర్లను జోడిస్తోంది. యూపీఐ చెల్లింపుల పరిమితిని కూడా క్రమంగా పెంచుకుంటూ వెళుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త యూపీఐ (UPI) ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. యూపీఐ ఇంటరాపరబుల్ కాష్ డిపాజిట్ (యూపీఐ-ఐసీడీ) పేరిట తెచ్చిన ఈ సౌకర్యం.. డెబిట్, క్రెడిట్ కార్డుల అవసరం మరింత తగ్గిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

టర్మ్‌ పాలసీలకు జీఎస్‌టీ మినహాయింపు?


గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ సందర్భంగా ఆర్బీఐ (RBI) డిప్యూటీ గవర్నర్ టీ. రవి శంకర్ ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు. దీని సాయంతో డెబిట్, క్రెడిట్ కార్డులు అవసరం లేకుండానే ఏటీఎంల ద్వారా కస్టమర్లు తమ అకౌంట్లలో డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే, విత్‌డ్రాల్స్‌తో పాటు డిపాజిట్‌కు అవకాశం ఉన్న క్యాష్ రీసైక్లర్ యంత్రాలున్న ఏటీఎంలలోనే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు తమ యూపీఐ యాప్‌, మొబైల్ నెంబర్‌తో పాటు, బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వినియోగించి అకౌంట్లో డబ్బు వేసుకోవచ్చు. ఇతరుల బ్యాంక్ అకౌంట్లకూ ఈ విధానంలో డబ్బు బదిలీ చేయొచ్చు. యూపీఐ చెల్లింపులను పర్యవేక్షించే ఎన్‌పీసీఐ సంస్థ ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకులు నిర్వహించే ఏటీఎంలతో పాటు వైట్ లేబుల్ ఏటీఎంలలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.


యూపీఐతో ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ ఇలా..

  • తొలుత ఏటీఎంలోని క్యాష్ డిపాజిట్ మెషీన్‌లో (సీడీఎమ్) యూపీఐ క్యాష్ డిపాజిట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

  • ఆ తరువాత సీడీఎమ్ స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను యూపీఐ యాప్‌తో స్కాన్ చేయాలి.

  • అనంతరం.. మీ వద్ద ఏయే కరెన్సీ నోట్లు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని స్క్రీన్‌పై ఉన్న ఆప్షన్స్‌ ద్వారా ఎంచుకోవాలి.

  • డిపాజిట్ చేయబొయే మొత్తం మీ యాప్‌లో, సీడీఎమ్ మెషీన్‌లో ఒకేలా ఉందో లేదో చెక్ చేయాలి

  • ఆ తరువాత డబ్బు డిపాజిట్ చేయబోయే అకౌంట్‌ను యూపీఐ యాప్‌ ద్వారా ఎంచుకోవాలి

  • చివరగా యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బు డిపాజిట్ అయిపోతుంది.

Read Latest and Business News

Updated Date - Aug 31 , 2024 | 09:32 AM

Advertising
Advertising