డిష్ టీవీ స్మార్ట్ ప్లస్
ABN, Publish Date - May 18 , 2024 | 03:40 AM
డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్)(DTH) ప్రొవైడర్ డిష్ టీవీ.. వినియోగదారుల కోసం డిష్ టీవీ స్మార్ట్ ప్లస్ పేరుతో సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
హైదరాబాద్: డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్)(DTH) ప్రొవైడర్ డిష్ టీవీ.. వినియోగదారుల కోసం డిష్ టీవీ స్మార్ట్ ప్లస్ పేరుతో సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. డిష్ టీవీ స్మార్ట్ ప్లస్‌లో డీటీహెచ్ వినియోగదారులకు టీవీ, ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంటెంట్‌ను అందించనున్నట్లు డిష్ టీవీ ఇండియా లిమిటెడ్ సీఈఓ మనోజ్ ధోబాల్ తెలిపారు.
శుక్రవారం నాడిక్కడ ఏపీ, తెలంగాణ మార్కెట్లోకి ఈ సర్వీ్‌సను లాంఛనంగా విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీవీ సబ్‌స్ర్కిప్షన్ ప్యాక్‌తో మొత్తం 21 ఓటీటీ యాప్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఓటీటీ యాప్స్ కోసం డీటీహెచ్ ఖాతాదారులు అదనంగా ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రస్తుత ఖాతాదారులు స్మార్ట్ ప్లస్‌కు మారాలనుకుంటే సెట్‌బాక్స్‌ను మార్చుకుంటే సరిపోతుందన్నారు. కాగా కొత్త ఖాతాదారులకు జాక్‌పాట్ ఆఫర్ పేరుతో ఈ సర్వీ్‌సను ఆఫర్ చేస్తున్నట్లు మనోజ్ తెలిపారు. డీటీహెచ్‌లో వచ్చే టీవీ కంటెంట్‌తో పాటు జీ5, సన్ నెట్‌వర్క్, డిస్నీ హాట్‌స్టార్, ఈటీవీ విన్ వంటి ఓటీటీ యాప్స్‌ను ఖాతాదారులు ఎక్కడైనా, ఏ స్ర్కీన్‌పైనా చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.
డీటీహెచ్ మార్కెట్లో డిష్ టీవీ వాటా 29 శాతం ఉందన్నారు. ఏపీ, తెలంగాణ మార్కెట్లో కంపెనీ వాటా 21 శాతం ఉందని తెలిపారు. కాగా వచ్చే ఏడాదిన్నర కాలంలో ఆండ్రాయిడ్ 4కే సెట్‌టాప్ బాక్స్, టీవీలో ఇన్‌బిల్ట్ ఎస్‌టీబీ, క్లౌడ్ సెట్‌టాప్ బాక్స్‌ను విడుదల చేయనున్నట్లు మనోజ్ తెలిపారు.
Updated Date - May 18 , 2024 | 03:41 AM