Dussehra Holidays: వరుసగా బ్యాంకులకు సెలవులు
ABN, Publish Date - Oct 09 , 2024 | 04:02 PM
ఈ ఏడాది విజయ దశమి.. శనివారం వచ్చింది. అంటే దసరా పండగ రెండో శనివారం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మరునాడు ఆదివారం కావడంతో.. అక్టోబర్ 10, 11 తేదీలు ఎప్పటిలాగే బ్యాంకులకు సెలవులు వచ్చాయి. కానీ వివిధ రాష్ట్రాల్లోని మరికొన్ని బ్యాంకులకు మాత్రం.. వరుసగా నాలుగు రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ క్రమంలో గురువారం నుంచి అంటే.. అక్టోబర్ 10వ తేదీ నుండి వరుసగా దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెలవులు ప్రకటించింది.
Also Read: Hydra: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్
అయితే ఈ ఏడాది విజయ దశమి.. శనివారం వచ్చింది. అంటే దసరా పండగ రెండో శనివారం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మరునాడు ఆదివారం కావడంతో.. అక్టోబర్ 10, 11 తేదీలు ఎప్పటిలాగే బ్యాంకులకు సెలవులు వచ్చాయి. కానీ వివిధ రాష్ట్రాల్లోని మరికొన్ని బ్యాంకులకు మాత్రం.. వరుసగా నాలుగు రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
Also Read: ఇలా చేస్తే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీకి ఎక్కువ లైఫ్ ఉంటుంది.. అది ఎలాగంటే..?
అవి ఎక్కడంటే.. ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, అసోం, బెంగాల్‌లలో అన్ని బ్యాంకులకు వరుసగా అక్టోబర్ 10, 11, 12, 13 తేదీలు సెలవులు ఇచ్చింది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోని మరొకటి సిక్కిం. ఈ రాష్ట్రంలో సైతం వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. అవి అక్టోబర్ 11, 12, 13, 14 తేదీలలో బ్యాంకులకు సెలవులు ఇచ్చింది.
అక్టోబర్ 10వ తేదీ.. మహా సప్తమి. దీంతో త్రిపుర, అసోం, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్‌ల్లోని అన్ని బ్యాంకులకు సెలవు అని ఆర్‌బీఐ వెల్లడించింది. ఇక అక్టోబర్ 11వ తేదీ దసరా. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, బిహార్, జార్ఖండ్, మేఘాలయాల్లోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవు అని ఆర్‌బీఐ తెలిపింది.
ఇక దేశవ్యాప్తంగా అక్టోబర్ ఒక్క మాసంలో బ్యాంకులకు 15 రోజులు సెలవులొచ్చాయి. రెండు, నాలుగు శనివారాలు, అన్ని ఆదివారాలతోపాటు దసరా సెలవులు కలుపుకుని బ్యాంకులకు సెలవులు వచ్చాయని ఆర్‌బీఐ వివరించింది. ఈ ఏడాది అక్టోబర్ మాసంలో గాంధీ జయంతితో ప్రారంభమైన సెలవులు.. దీపావళి పండగ సెలవుతో ముగియనుంది.
For Business News And Telugu News..
Updated Date - Oct 09 , 2024 | 04:02 PM