ELI: ఈ స్కీంకు మీ ఆధార్ లింక్ చేశారా లేదా.. కొన్ని రోజులే గడువు..
ABN, Publish Date - Dec 08 , 2024 | 09:39 AM
మీరు ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం కింద ఆధార్ లింక్ చేశారా లేదా, లేకుంటే ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే దీని గడువు త్వరలోనే ముగియనుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) స్కీంకు ఇంకా లింక్ చేసుకున్నారా, లేదంటే ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే మరికొన్ని రోజుల్లోనే దీని గడువు ముగియనుంది. ఇటివలనే ELI పథకంలో యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాడ్ చేసుకునేందుకు చివరి తేదీని EPFO డిసెంబర్ 15, 2024 వరకు పొడిగించింది. ఇంతకు ముందు ఈ గడువు 30 నవంబర్ 2024 వరకు ఉండేది. ఈపీఎఫ్‌వో సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని అందించింది. దీంతోపాటు బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడానికి ప్రభుత్వం చివరి తేదీని కూడా పొడిగించింది.
2024-25 బడ్జెట్
2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఉపాధి సంబంధిత ప్రోత్సాహక పథకం కోసం మూడు పథకాలు A, B, Cలను ప్రకటించారు. ఇందులో రూ.2 లక్షల కోట్ల వ్యయంతో 5 ఏళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యాలు, ఇతర అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ELI పథకం లక్ష్యం 2 సంవత్సరాలలో 2 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించడం. ఇందులో స్కీమ్ A మొదటిసారిగా ఉపాధి పొందుతున్న వ్యక్తులు ఉంటారు. ప్లాన్ బీలో తయారీ రంగంలో ఉద్యోగాలను సృష్టించడంపై దృష్టి పెడుతారు. ప్లాన్ సీ యజమానులకు మద్దతు ఇవ్వడంపై ఫోకస్ చేస్తారు.
ప్లాన్ ఏ: మొదటిసారి ఉద్యోగార్ధులకు
స్కీమ్ ఏ మొదటి సారి పని చేస్తున్న వారి కోసం. ఇందులో ఉద్యోగులకు మూడు విడతలుగా రూ.15 వేల వరకు వేతనం అందజేస్తారు. ఈ డబ్బు నేరుగా ఆధార్‌తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు వెళ్తుంది. కొత్త వారిని ఉద్యోగాల్లో చేర్చేందుకు, వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం రూపొందించబడింది.
ప్లాన్ బీ: తయారీ రంగానికి
తయారీ రంగంలో ఉపాధిని పెంచడమే ప్లాన్ బీ లక్ష్యం. ఈ పథకంలో యజమానులు, కొత్త ఉద్యోగులు EPFO సహకారంపై ప్రోత్సాహాన్ని పొందుతారు. ఈ ప్రయోజనం నాలుగేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. తయారీ రంగంలో కొత్త ఉద్యోగాలు కల్పించడానికి, ఉత్పత్తిని పెంచడానికి ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్లాన్ సీ: మరింత ఉపాధి కోసం
ప్లాన్ సీ అనేది అన్ని రంగాలలోని యజమానుల కోసం. ఇందులో కొత్త ఉద్యోగికి నెలకు రూ. 3 వేలు ప్రభుత్వం యాజమాన్యానికి ఇస్తుంది. ఈ సహాయం రెండేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంతో, యజమానులు ఎక్కువ మందిని నియమించుకోగలుగుతారు. 1 లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ క్రమంలో డిసెంబర్ 15, 2024లోపు UAN, ఆధార్ తప్పనిసరిగా లింక్ చేయబడాలని EPFO చెబుతోంది, తద్వారా ఉద్యోగులు ఈ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు.
సేవల సద్వినియోగం
UANని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఉద్యోగులు EPFO అనేక సేవలను యాక్సెస్ చేసుకోగలుగుతారు. దీంతో వారు తమ పీఎఫ్ ఖాతాలను చక్కగా నిర్వహించుకోవచ్చు. మీరు పీఎఫ్ పాస్‌బుక్‌ని వీక్షించవచ్చు, డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. అదనంగా ఉద్యోగులు పాక్షిక ఉపసంహరణలు, అడ్వాన్స్‌లు లేదా బదిలీల కోసం క్లెయిమ్‌లను సమర్పించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 08 , 2024 | 09:41 AM