ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుటుంబ షేరు పైపైకి

ABN, Publish Date - Dec 26 , 2024 | 05:31 AM

భారతీయ కుటుంబాలు దీర్ఘకాలిక పొదుపు కోసం ఈక్విటీలపై ఆధార పడే ట్రెండ్‌ ఏటేటా పెరుగుతూ వస్తోందని బ్రోకరేజీ సంస్థ ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. దేశీయ కుటుంబాల పొదుపులో...

వారి పొదుపులో ఈక్విటీల వాటా 31 శాతానికి..

  • వచ్చే 8-10 ఏళ్లు ఇదే ట్రెండ్‌ కొనసాగే చాన్స్‌

  • ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ నివేదిక వెల్లడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారతీయ కుటుంబాలు దీర్ఘకాలిక పొదుపు కోసం ఈక్విటీలపై ఆధార పడే ట్రెండ్‌ ఏటేటా పెరుగుతూ వస్తోందని బ్రోకరేజీ సంస్థ ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. దేశీయ కుటుంబాల పొదుపులో ఈక్విటీల వాటా 2016 ఆర్థిక సంవత్సరంలో 17 శాతంగా ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం నాటికి దాదాపు 31 శాతానికి చేరుకుందని నివేదికలో వెల్లడించింది. అంటే, 8 ఏళ్లకు పైగా కాలంలో ఈక్విటీ వాటా దాదాపు రెట్టింపైంది. ఈక్విటీల్లో వీరి పెట్టుబడుల పెరుగుదల ట్రెండ్‌ వచ్చే 8-10 ఏళ్లపాటు కొనసాగవచ్చని అంచనా వేసింది. బ్యాంక్‌ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం తగ్గడం, సామాజిక భద్రత పథకాల లేమితో పాటు డిజిటల్‌ పెట్టుబడి వేదికలు అందుబాటులోకి రావడంతో కుటుంబాలు సంప్రదాయ పొదుపు సాధనాలైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, జీవిత బీమా పథకాల నుంచి ఈక్విటీల్లో పెట్టుబడుల వైపు దృష్టి మళ్లిస్తున్నారని నివేదికలో పేర్కొంది.


గడిచిన కొన్నేళ్లలో భారత స్టాక్‌ మార్కెట్ల బలమైన పనితీరు కూడా కుటుంబాలను ఆకర్షిస్తోందని అంటోంది. దాంతో కుటుంబాలు ఈక్విటీల్లో నేరుగా లేదా మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా పెట్టుబడులు పెడుతున్నారు. నివేదికలోని మరిన్ని విషయాలు..

  • 2016-24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో దేశీయ ఈక్విటీల్లో పెట్టుబడులు ఏటేటా 22 శాతం చొప్పున వృద్ధి చెందాయి. మన ఈక్విటీల్లో దేశీ ఇన్వెస్టర్ల వాటా క్రమంగా పెరుగుతుండటంతో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల (ఎఫ్‌పీఐ)పై ఆధారం తగ్గుతోంది. దాంతో ఎఫ్‌పీఐలు భారీగా అమ్మకాలకు పాల్పడినప్పటికీ మన మార్కెట్‌ తట్టుకోగలుగుతోంది.

  • 2019 మార్చి నుంచి బీఎ్‌సఈ 500 సూచీ కంపెనీల షేర్లలో ఎఫ్‌పీఐ వాటా 2.7 శాతం మేర తగ్గింది. మన మ్యూచువల్‌ ఫండ్లు సహా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 4 శాతం పెరిగింది.

  • 2016-24 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో డీమ్యాట్‌ ఖాతాలు 39 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌)ను నమోదు చేయగా.. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల ఖాతాల సీఏజీఆర్‌ 19 శాతంగా ఉంది. ఇదే కాలంలో ఒక్కో డీమ్యాట్‌ ఖాతాలోని ఈక్విటీ షేర్ల రిటైల్‌ హోల్డింగ్‌ తగ్గింది. మార్కెట్లో కేంద్రీకృత ఈక్విటీ ఆస్తులు తగ్గుముఖం పడుతుందనడానికి ఇదే సంకేతం.


  • మార్కెట్‌ పరిధి విస్తృతమవుతోంది. ప్రస్తుతం వ్యక్తిగత ఈక్విటీ పెట్టుబడుల్లో 27 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరవాసులకు చెందినవే.

  • మ్యూచువల్‌ ఫండ్లు స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులకు మొగ్గుచూపుతుండగా.. ఎఫ్‌పీఐలు మాత్రం అధికంగా లార్జ్‌క్యా్‌ప్సకే కట్టుబడి ఉంటున్నాయి.

  • భవిష్యత్‌లో కుటుంబ పొదుపులో ఈక్విటీ వాటాయే కీలకం కానున్నప్పటికీ, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్స్‌ (రీట్స్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్స్‌)ల్లోకీ వీరి పెట్టుబడులు పెరగనున్నాయి.

Updated Date - Dec 26 , 2024 | 05:31 AM