ఫెడ్ రేటు 0.25% తగ్గింపు
ABN, Publish Date - Dec 19 , 2024 | 05:16 AM
అమెరికా సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటును మరో 0.25 శాతం తగ్గించింది. ఫెడ్ రిజర్వు చైర్మన్ జెరోం పావెల్ అధ్యక్షతన రెండ్రోజుల పాటు....
ఈ ఏడాది మూడోసారి
న్యూయార్క్: అమెరికా సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటును మరో 0.25 శాతం తగ్గించింది. ఫెడ్ రిజర్వు చైర్మన్ జెరోం పావెల్ అధ్యక్షతన రెండ్రోజుల పాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఫెడ్ రేట్ల శ్రేణి 2022 డిసెంబరు నాటి స్థాయి 4.25-4.50 శాతానికి తగ్గింది. ఈ ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వరుసగా ఇది మూడోసారి. 2025లో మాత్రం వడ్డీ రేట్లను మరో రెండు సార్లే తగ్గించే అవకాశం ఉందని ఫెడ్ రిజర్వ్ సంకేతాలిచ్చింది.
Updated Date - Dec 19 , 2024 | 05:16 AM