ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Union Budget 2024-25: చరిత్ర సృష్టించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ABN, Publish Date - Jul 23 , 2024 | 11:30 AM

కేంద్ర బడ్జెట్ 2024-25ను లోక్‌సభకు సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. వరుసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన వ్యక్తిగా ఆమె నిలిచారు.

కేంద్ర బడ్జెట్ 2024-25ను లోక్‌సభకు సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. వరుసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన వ్యక్తిగా ఆమె నిలిచారు. మాజీ ప్రధాన మంత్రి మొరార్జ్ దేశాయ్ మాత్రమే వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రికార్డును సీతారామన్ ఇప్పుడు బ్రేక్ చేశారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగానూ ఆమె రికార్డు సృష్టించారు. సీతారామన్ ఆర్థిక మంత్రిగా 2019 జులైలో బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి వరుసగా 6 సార్లు సంపూర్ణ బడ్జెట్‌, మధ్యంతర లేదా వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌తో వరుసగా 7వ సారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టయింది.


ఆర్థిక మంత్రులుగా వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పీ చిదంబరం, యశ్వంత్ సిన్హాలను సీతారామన్ అధిగమించారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1959 నుంచి 1964 మధ్యకాలంలో 5 వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభకు సమర్పించారు.

Updated Date - Jul 23 , 2024 | 12:02 PM

Advertising
Advertising
<