ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Flipkart: ఆన్‌లైన్‌ షాపింగ్ చేసేవారికి ఝలక్.. అలా చేస్తే ఎక్స్ ట్రా ఛార్జీలు కట్టాల్సిందే..

ABN, Publish Date - Dec 10 , 2024 | 06:33 PM

ఆన్ లైన్ లో కొనుక్కోవడం రానున్న రోజుల్లో మరీ అంత థ్రిల్లింగ్ గా ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే కస్టమర్లకు షాకిచ్చేందుకు ఫ్లిప్ కార్ట్, మింత్ర వంటి దిగ్గజ సంస్థలు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఎక్స్ ట్రా ఛార్జీలు వడ్డించే విధంగా ప్రణాళికలు చేస్తోంది.

Flipkart

కరోనా పుణ్యమా అని భారత్ లోనూ ఆన్ లైన్ షాపింగ్ కు విపరీతమైన ఆదరణ లభించింది. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకున్నా నిమిషాల్లో నచ్చిన ఐటెం కొనుక్కునే వెసులుబాటు ఉండటంతో అంతా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సైట్లకు జై కొట్టారు. సెల్ ఫోన్లో గంటలకొద్దీ డీల్స్ చెక్ చేయడం నేటి తరానికి ఓ హాబీలా మారిపోయింది. కానీ, ఇప్పుడు ఆన్ లైన్ లో కొనుక్కోవడం రానున్న రోజుల్లో మరీ అంత థ్రిల్లింగ్ గా ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే కస్టమర్లకు షాకిచ్చేందుకు ఫ్లిప్ కార్ట్, మింత్ర వంటి దిగ్గజ సంస్థలు సిద్ధమవుతున్నాయి.


ఎవరైనా ఆన్ లైన్ లో ఎందుకు కొంటారు. ప్రాడక్ట్ ఏమాత్రం నచ్చకపోయినా వెంటనే రిటర్న్ చేసే సదుపాయం ఉండటం వల్లే కదా.. ఇప్పుడా వెసులుబాటు లేకుండా పోనుంది. ఎవరైనా ప్రాడక్ట్ ను రిటర్న్ చేయాలనుకుంటే దానికి మినిమం ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందట. అది కూడా అన్నింటికీ ఒకేలా కాకుండా మీరు కొనుక్కున్న వస్తువు ధరను బట్టి రిటర్న్ చేయాల్సిన చార్జీల శాతం ఆధారపడి ఉంటుందట. ఇది ఆన్ లైన్ షాపింగ్ చేసేవారికి నిజంగా పిడుగులాంటి వార్త. ఇకపై ఏది పడితే అది ఆర్డర్ పెట్టుకుని ఆ వెంటనే నచ్చలేదంటూ రిటర్న్ చేసేవారు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే కొనే చార్జీలకన్నా రిటర్న్ చార్జీలతోనే జేబుకు చిల్లు పడటం ఖాయం.


అయితే, దీనిపై ఫ్లిప్ కార్ట్, మింత్ర అధికారిక ప్రకటనేమీ చేయలేదు. కానీ త్వరలోనే ఈ కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చేందుకు ఈ సంస్థలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ లో కొనుగోలు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాడ్ ను అరికట్టేందుకు, అమ్మకం దారులకు నష్టాలను పూడ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్క ఫ్లిప్ కార్ట్ కస్టమర్ల విషయంలోనే ఈ ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం. అయితే మింత్రా కూడా ఈ మాతృ సంస్థలోనే భాగం కావడం వల్ల దీనిపైనా ఆ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి.

టాటా మోటార్స్‌, కియ కార్ల ధరలు పెంపు



Updated Date - Dec 10 , 2024 | 06:33 PM