ఏపీ, తెలంగాణ ఎంఎ్‌సఎంఈలపై దృష్టి
ABN, Publish Date - Dec 24 , 2024 | 05:33 AM
శ్రీరామ్ గ్రూప్ కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎ్‌సఎంఈ)పై ప్రత్యేక దృష్టి పెడుతోంది....
శ్రీరామ్ ఫైనాన్స్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): శ్రీరామ్ గ్రూప్ కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎ్‌సఎంఈ)పై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం సెప్టెంబరు నాటికి ఏపీలోని ఎంఎ్‌సఎంఈలకు రూ.4,907.89 కోట్లు, తెలంగాణలోని ఎంఎ్‌సఎంఈలకు రూ.4,666.20 కోట్లు రుణాలుగా మంజూరు చేసింది. ఇవి అన్ని రంగాలకు కలిపి ఇచ్చిన తమ మొత్తం రుణాల్లో 13.29 శాతానికి సమానమని తెలిపింది. రెండు రాష్ట్రాల్లోని తయారీ, సేవలు వాణిజ్య రంగాలకు చెందిన ఎంఎ్‌సఎంఈల రుణ అవసరాలపై శ్రీరామ్ ఫైనాన్స్ ప్రత్యేక దృష్టి పెట్టింది.
Updated Date - Dec 24 , 2024 | 05:33 AM