ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Price Updates: పసిడి ప్రియులకు షాకింగ్.. రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు

ABN, Publish Date - Jul 18 , 2024 | 06:28 AM

దేశంలో బంగారం (gold) కొనుగోలు దారులకు మళ్లీ షాకింగ్ న్యూస్. ఈసారి ఏకంగా 10 గ్రాముల పుత్తడి ధర రూ.980 రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు (జులై 18న) ఉదయం 6.25 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.68,760కు చేరుకుంది.

july 18th 2024 gold and silver rate updates

దేశంలో బంగారం (gold) కొనుగోలు దారులకు మళ్లీ షాకింగ్ న్యూస్. ఈసారి ఏకంగా 10 గ్రాముల పుత్తడి ధర రూ.980 రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు (జులై 18న) ఉదయం 6.25 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.68,760 కాగా, 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.75,010కి చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.75,160కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 68,910కు చేరింది. మరోవైపు వెండి(silver) ధరలు కేజీకి రూ. 1200 పెరిగి ఢిల్లీలో రూ.96,100కు చేరుకున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలను తాకడం విశేషం.


ప్రధాన ప్రాంతాల్లో 10 గ్రాముల పుత్తడి రేట్లు (24 క్యారెట్లు), (22క్యారెట్లు)

  • చెన్నైలో రూ. 75,500, రూ. 69,210

  • హైదరాబాద్‌లో రూ. 75,010, రూ. 68,760

  • విజయవాడలో రూ. 75,010, రూ. 68,760

  • ఢిల్లీలో రూ.75,160, రూ. 68,910

  • ముంబైలో రూ. 75,010, రూ. 68,760

  • వడోదరలో రూ. 75,060, రూ. 68,810

  • కేరళలో రూ. 75,010, రూ. 68,760

  • బెంగళూరులో రూ. 75,010, రూ. 68,760

  • కోల్‌కతాలో రూ. 75,010, రూ. 68,760

దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కేజీ వెండి ధరలు

  • ఢిల్లీలో రూ. 96,100

  • చెన్నైలో రూ. 100,600

  • ముంబైలో రూ. 96,100

  • హైదరాబాద్‌లో రూ. 100,600

  • విజయవాడలో రూ. 100,600

  • బెంగళూరులో రూ. 94,850

  • కోల్‌కతాలో రూ. 96,100

  • కేరళలో రూ. 100,600

  • వడోదరలో రూ. 96,100


అయితే అమెరికాలో వడ్డీ రేటు తగ్గే అవకాశం మళ్లీ ఊపందుకోవడంతో బంగారం ధర పెరిగింది. అంతకుముందు ఏప్రిల్, మే నెలల్లో కూడా ధరలు పలుమార్లు ఎగువ స్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో కూడా జూన్‌లో వడ్డీ రేటు తగ్గే అవకాశం పెరిగింది. కానీ ఈ అవకాశం బలహీనపడటంతో మే, జూన్ చివరి వారంలో ధరల్లో కరెక్షన్ కనిపించింది. మరోవైపు ప్రపంచ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సు రికార్డు స్థాయి $2,482.29కి చేరుకుంది. US ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా ట్రేడింగ్‌లో ఔన్స్‌కి $ 2,487.40 వద్ద కొత్త రికార్డు స్థాయిలో కనిపించింది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 20 శాతం పెరిగాయి.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.


ఇవి కూడా చదవండి:


Budget 2024: బడ్జెట్‌ 2024లో ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!

రియల్టీలోకి పీఈ పెట్టుబడులు రూ.25,000 కోట్లు


For Latest News and Business News click here

Updated Date - Jul 18 , 2024 | 06:39 AM

Advertising
Advertising
<