Gold and Silver Rates: మహిళామణులకు గుడ్ న్యూస్ .. మళ్లీ తగ్గిన పసిడి ధర
ABN, Publish Date - Dec 17 , 2024 | 08:28 AM
రూ. 80 వేల మార్క్ కు చేరిన పసిడి ధర ఇటీవల తగ్గింది. ఈ ధరలు మళ్లీ తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ఎంత ధర తగ్గిందే.. అదే స్థాయిలో 24 క్యారెట్ల బంగారం ధర తగ్గడం గమనార్హం
ఇటీవల వరకు పసిడి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 80 వేల మార్క్ ను దాటింది. కానీ గత కొద్ది రోజులుగా వాటి ధరలు కొద్ది కొద్దిగా దిగి వస్తు్న్నాయి. నిన్న పసిడి ధర మీద జస్ట్ రూ. 100 తగ్గింది. అంటే సోమవారం పసిడి 24 క్యారట్ల 100 గ్రాములు ధర రూ. 7, 78, 900 ఉంటే.. మంగళవారం రూ. 7, 78, 800కి దిగింది. ఇక పసిడి 22 క్యారెట్ల బంగారం ధర సోమవారం రూ. 7,13,900 ఉంటే.. మంగళవారం ఆ ధర రూ. 7,13,800 ఉంది. అంటే 22 క్యారట్ల బంగారం ధర రూ. 100 మేర తగ్గింది. ఇక వెండి ధరను పరిశీలిస్తే.. సోమవారం కిలో వెండి ధర రూ. లక్ష మార్క్ ను చేరుకుంది. ఈ ధర మంగళవారం కాస్త తగ్గింది. అంటే.. రూ. 99,900గా ఉంది. అంటే పసిడిలాగానే వెండి ధర సైతం జస్ట్ రూ. 100 మాత్రమే తగ్గింది. అయితే దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం దేశంలోని వివిధ ప్రాంతాల కంటే.. పసిడి ధర గరిష్టంగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర.. రూ. 7,80,300గా ఉంది.
ఇక నేడు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (100 గ్రాములు) ఎంత ఉన్నాయంటే..
హైదరాబాద్ లో రూ. 7, 13,900 (22 క్యారెట్లు), రూ. 7,78,800 (24 క్యారెట్లు)
విజయవాడ: రూ. 7, 13,900 (22 క్యారెట్లు).. రూ.7,78,800 (24 క్యారెట్లు)
విశాఖపట్నం: రూ. 7,13,900 (22 క్యారెట్లు), రూ. 7,78,800 ( 24 క్యారెట్లు)
ఇక నేడు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయంటే..
హైదరాబాద్: రూ. 99, 900
విజయవాడ: రూ. 99, 900
విశాఖపట్నం: రూ. 99, 900
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశ వాణిజ్య రాజధాని ముంబయి: రూ. 7,13,900 (22 క్యారెట్లు), రూ. 7,78,800 (24 క్యారెట్లు)
దేశ రాజధాని ఢిల్లీ: రూ.7,15, 400 (22 క్యారెట్లు), రూ.7,80,300 (24 క్యారెట్లు)
కోల్ కత్తా: రూ. 7,13,900 (22 క్యారెట్లు), రూ. 7,78,800 (24 క్యారెట్లు)
చెన్నయి: రూ. 7,13,900 (22 క్యారెట్లు), రూ. 7,78,800 (24 క్యారెట్లు)
For Business News And Telugu News
Updated Date - Dec 17 , 2024 | 08:34 AM