Gold and Silver Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు
ABN , Publish Date - Nov 16 , 2024 | 06:33 AM
గత వారం చౌకగా మారిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఖరీదైనవిగా మారాయి. తాజాగా ఈ రేట్లు మళ్లీ పెరగడం విశేషం. అయితే ఎంత పెరిగింది, ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం(gold), వెండి (silver) ధరలు ఇటివల ఆకాశాన్ని తాకాయి. కానీ ఆ తర్వాత గత నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ నేడు ఉదయం నాటికి తగ్గిన ధరలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో బంగారం ధరలు స్వల్పంగా పెరుగగా, వెండి రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 130 రూపాయలు పెరుగగా, కిలో వెండి ధరలు నిన్నటి స్థాయిలోనే ఉన్నాయి.
నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.25 గంటల నాటికి 24 క్యారెట్ల 10 బంగారం గ్రాముల ధర రూ. 75,920కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 69,610కు చేరింది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 69,460కు చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,770 స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
ఢిల్లీలో రూ. 75,920, రూ. 69,610
హైదరాబాద్‌లో రూ. 75,770, రూ. 69,460
విజయవాడలో రూ. 75,770, రూ. 69,460
వడోదరలో రూ. 75,820, రూ. 69,510
చెన్నైలో రూ. 75,770, రూ. 69,460
కేరళలో రూ. 75,770, రూ. 69,460
ముంబైలో రూ. 75,770, రూ. 69,460
పూణేలో రూ. 75,770, రూ. 69,460
కోల్‌కతాలో రూ. 75,770, రూ. 69,460
బెంగళూరులో రూ. 75,770, రూ. 69,460
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
తిరుపతిలో రూ. 98,900
హైదరాబాద్‌లో రూ. 98,900
విజయవాడలో రూ. 98,900
సూరత్‌లో రూ. 89.400
వడోదరలో రూ. 89,400
పాట్నాలో రూ. 89,400
అహ్మదాబాద్‌లో రూ. 89,400
ఢిల్లీలో రూ. 89,400
చెన్నైలో రూ. 98,900
కేరళలో రూ. 98,900
ముంబైలో రూ. 89,400
కోల్‌కతాలో రూ. 89,400
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..
Read More International News and Latest Telugu News