ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Prices: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. మీ ప్రాంతంలో ఎంతంటే

ABN, Publish Date - Sep 04 , 2024 | 07:01 AM

కొంత కాలంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగాయి. వారం రోజులుగా బంగారం ధరలో పెరుగుదల కనిపించడం లేదు.

ఇంటర్నెట్ డెస్క్: కొంత కాలంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగాయి. వారం రోజులుగా బంగారం ధరలో పెరుగుదల కనిపించడం లేదు. బుధవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తున్నందునా.. ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. గోల్డ్ కొనేవారికి ఇప్పుడే మంచి అవకాశం. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కోల్‌కతాలో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,690గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,760 వద్ద ఉంది.

  • దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగార ధర రూ. 66,840కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,910 వద్ద కొనసాగుతోంది.

  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,690గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,760 వద్ద కొనసాగుతోంది.

  • ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,690గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 72,760వద్ద ట్రేడవుతోంది.


తెలుగు రాష్ట్రాలు..

తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,690గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,760గా ఉంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,690, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,760గా ఉంది. విశాఖపట్నం సహా ఏపీలోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు...

వరుసగా రూ.100 మేర తగ్గుతూ వస్తున్న వెండి ధరలు బుధవారం కూడా అదే బాటలో నడిచాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి కిలోకు రూ.100 తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 85,900గా ఉండగా.. ముంబయిలో రూ. 85,900, బెంగళూరులో రూ. 82,900 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 90,800 గా ఉంది.

For Latest News click here

Updated Date - Sep 04 , 2024 | 07:40 AM

Advertising
Advertising