Gold Rates: పసిడి పైపైకి.. రికార్డు ధరకు చేరిన బంగారం, వెండి కూడా
ABN, Publish Date - Apr 08 , 2024 | 02:36 PM
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్.. పండగలు రావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్.. పండగలు రావడంతో బంగారం (Gold Rates) ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.72 వేల మార్క్ దాటింది. చెన్నైలో రికార్డు ధరకు చేరింది. 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగింది. సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో అధిక ధర
ఢిల్లీలో సోమవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 71 వేల 770గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65, 800గా ఉంది. ముంబైలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 71 వేల 620గా ఉంది. బెంగళూర్, హైదరాబాద్‌లో కూడా మేలిమి బంగారం ధర రూ. 71 వేల 620గా ఉంది. కోల్ కతా, కొచ్చి, పుణెలో సేమ్ రేట్ ఉంది. అహ్మదాబాద్‌లో కాస్త ఎక్కువగా రూ.71 వేల 670గా ఉంది. చెన్నైలో ఆల్ టైం హైకి చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. రూ.72 వేల 650గా ఉంది. దేశంలో చెన్నైలో రికార్డు ధరకు చేరింది. కిలో వెండి ధర రూ. 81 వేలు దాటింది. 1 గంట వరకు కిలో రూ.81 వేల 717గా ఉంది.
ఇవి కూడా చదవండి:
Stock Markets: సరికొత్త శిఖరంపై దేశీయ మార్కెట్లు.. ఏకంగా రూ.400 లక్షల కోట్లు
Money Management: 7 మనీ మేనేజ్‌మెంట్ టిప్స్.. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోండిలా
మరిన్ని బిజినెస్ వార్తల కోసం
Updated Date - Apr 08 , 2024 | 02:38 PM