Gold Investments: భారీగా తగ్గిన బంగారం ధర.. పెట్టుబడి చేయాలా వద్దా..
ABN, Publish Date - Dec 14 , 2024 | 05:32 PM
ఐదు వారాల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత శుక్రవారం బంగారం ధర భారీగా పడిపోయింది. అయితే భవిష్యత్తులో గోల్డ్ రేటు పెరిగే అవకాశం ఉందా లేదా తగ్గనుందా. ఇలాంటి సమయంలో పెట్టుబడి దారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ వారం స్టాక్ మార్కెట్‌లో చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయి. అదే సమయంలో ఫ్యూచర్స్ మార్కెట్‌లో కూడా చాలా కదలిక వచ్చింది. ఇక బంగారం గురించి మాట్లాడితే ఇది 5 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత, శుక్రవారం (డిసెంబర్ 13న) ప్రాఫిట్ బుకింగ్ కారణంగా భారీగా ధర తగ్గింది. ఫిబ్రవరి 2024 ఫ్యూచర్స్ గడువు ముగిసే సమయానికి MCXలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 77,130 వద్ద ముగిసింది. ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 79,775 నుంచి రూ. 2,645 తగ్గడం విశేషం. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధర ట్రాయ్ ఔన్స్‌కు $ 2,648కు చేరింది. అయితే COMEXలో బంగారం ధర ట్రాయ్ ఔన్స్‌కు $ 2,675కు చేరుకుంది.
వచ్చే ఏడాది ఎలా..
ఇక ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాదిలో బంగారం ధర మరోసారి 2700 డాలర్ల స్థాయికి చేరుకుంటుందని మార్కెట్ నిపుణుడు ధర్మేష్ భాటియా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాథమికంగా చూస్తే, US ఫెడ్ వడ్డీ రేట్లలో బాగా తగ్గింపు వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది బంగారం పెరుగుదలకు ఇది చాలా దోహదపడుతుందన్నారు.
త్వరలో ఇది..
ఇదే సమయంలో రూపాయిలో చాలా బలహీనతలు ఉండవచ్చన్నారు. అతి త్వరలో ఇది రూ. 85, రూ. 86 స్థాయిల్లో కనిపించవచ్చని భావించారు. ఇక దేశీయ మార్కెట్‌లో స్వల్ప కాలానికి బంగారాన్ని కొనుగోలు చేస్తే కొనుగోలు అభిప్రాయం 78400 స్థాయిలో ఉంటుందని, స్టాప్ లాస్‌ను 78200 వద్ద ఉంచాలని సూచించారు. మీరు అప్‌సైడ్ లక్ష్యం కోసం చూస్తే 78,800 వరకు పెట్టుబడి పెట్టవచ్చన్నారు.
ఎప్పుడు కొనుగోలు చేయాలంటే..
అయితే రానున్న కాలంలో బంగారం మరోసారి 80,000 స్థాయికి చేరుకోవచ్చని, ఇలాంటి పరిస్థితుల్లో సగటున బంగారం చాలా బుల్లిష్‌గా ఉంటుందన్నారు. అయితే గోల్డ్ రేట్లు క్షీణించినప్పుడు మాత్రమే కొనుగోలు చేయాలనేది మీరు గుర్తుంచుకోవాలి. మరోవైపు 2025లో బంగారం ధర 12-15 శాతం జంప్‌ను చూడవచ్చని మోతీలాల్ ఓస్వాల్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ కిషోర్ నార్నే కూడా అన్నారు. వెండి విషయానికి వస్తే 35 శాతం పెరుగుదల ఉండవచ్చన్నారు. స్వల్పకాలిక సమయానికి దాదాపు 76,900 లేదా 77000 స్థాయిలో బంగారం కొనుగోలు చేస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా కీలకం
వచ్చే వారం జరగనున్న యూఎస్ ఫెడ్ సమావేశంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ అభిప్రాయాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వడ్డీ రేట్లను తగ్గించడానికి ఫెడ్ మరింత జాగ్రత్తగా వ్యవహరించనుంది. ఈ క్రమంలో ట్రంప్ విస్తరణ విధానాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని పలువురు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 14 , 2024 | 05:34 PM