Share News

Gold Price Hike: బంగారం ప్రియులకు భారీ షాక్.. ఆల్ టైం హైకి ధరలు

ABN , Publish Date - Sep 20 , 2024 | 03:00 PM

అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇవాళ బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 19న రూ.74,450 ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు ఒక శాతం మేర పెరిగింది.

Gold Price Hike: బంగారం ప్రియులకు భారీ షాక్.. ఆల్ టైం హైకి ధరలు

హైదరాబాద్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇవాళ బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 19న రూ.74,450 ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు ఒక శాతం మేర పెరిగింది. హైదరాబాద్‌లో బంగారం ధర ఇవాళ రూ.75 వేల మార్కును దాటింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,850గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.75,110గా ఉంది. మే నెలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.68,900 , రూ.75,160గా నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బంగారం ధరలెలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • న్యూఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,000, 24 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాముల ధర రూ.75,260గా ఉంది.

  • కోల్‌కతా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68, 850, 24 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాముల ధర రూ.75,110గా ఉంది.

  • ముంబయి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68, 850, 24 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాముల ధర రూ.75,110గా ఉంది.

  • హైదరాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68, 850, 24 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాముల ధర రూ.75,110గా ఉంది.

  • చెన్నై 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68, 850, 24 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాముల ధర రూ.75,110గా ఉంది.


రేట్లు పెరగడానికి కారణాలు

హైదరాబాద్‌ సహా ప్రపంచ దేశాల్లో బంగారం ధరలు పెరగడానికి పలు కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించడం. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేటును మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా అర(0.50) శాతం తగ్గించింది.

దాంతో ప్రామాణిక వడ్డీ రేట్ల శ్రేణి 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి 5.25-5.50 శాతం నుంచి 4.75-5.0 శాతానికి తగ్గింది. నవంబర్‌లో అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను కనీసం 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధరలు పెరిగినందున భారత్‌లో బంగారం కొనుగోళ్లు తగ్గవచ్చు. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ పరిస్థితులు సహా అనేక అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.

Read LatestAP NewsANdTelugu News

Updated Date - Sep 20 , 2024 | 03:01 PM