Gold and Silver Rates Today: ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, Publish Date - Dec 26 , 2024 | 06:33 AM
దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. యూఎస్ డాలర్ బలపడటం సహా పలు అంశాల నేపథ్యంలో వీటి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. అయితే నేడు ఏ మేరకు తగ్గాయి, ఎంత ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో బంగారం(gold), వెండి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి. దీంతోపాటు గ్లోబల్ మార్కెట్లో ధరలు, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహం, డాలర్ వ్యత్యాసాలు, దేశీయ మార్కెట్ నిర్ణయాలు కూడా ఈ ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో నేడు ఉదయం 6.25 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 76,150కి చేరుకుంది. ఇది నిన్నటితో పోల్చితే 150 రూపాయల తగ్గింది.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,804కు చేరుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,410కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,043కు చేరింది. ఇక రేట్ల గురించి తెలుసుకుంటే కిలో వెండి ధర రూ. 89,350 స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో బంగారం, వెండి రేట్ల గురించి ఇక్కడ చూద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
హైదరాబాద్‌లో రూ. 76,410, రూ. 70,043
విజయవాడలో రూ. 76,410, రూ. 70,043
ఢిల్లీలో రూ. 76,150, రూ. 69,804
చెన్నైలో రూ. 76,510, రూ. 70,134
ముంబైలో రూ. 76,290, రూ. 69,933
కోల్‌కతాలో రూ. 76,190, రూ. 69,841
వడోదరలో రూ. 76,390, రూ. 70,024
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
చెన్నైలో రూ. 89,470
ముంబైలో రూ. 89,210
ఢిల్లీలో రూ. 89,060
హైదరాబాద్‌లో రూ. 89,350
విశాఖపట్నంలో రూ. 89,350
వడోదరలో రూ. 89,330
కోల్‌కతాలో రూ. 89.090
22, 24 క్యారెట్ల మధ్య తేడా మీకు తెలుసా?
బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్క్ ఇస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను 22 క్యారెట్ల బంగారంలో 9% కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం విలాసవంతమైనది అయినప్పటికీ, దీనిని ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించుకోలేరు. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారం విక్రయిస్తారు.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 26 , 2024 | 06:45 AM