Gold and Silver Rates Today: షాకింగ్.. పరుగులు తీసిన బంగారం, వెండి రేట్లు
ABN, Publish Date - Dec 27 , 2024 | 06:27 AM
మీరు ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఒక్కసారి వీటి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి మరి. ఎందుకంటే నిన్న తగ్గిన ఈ ధరలు, ఈరోజు ఉదయం నాటికి మాత్రం భారీగా పెరిగాయి.
గత కొన్ని రోజులుగా బంగారం (gold), వెండి (silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్న తగ్గిన బంగారం ధరలు, ఈరోజు మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 27న) ఉదయం 6.10 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,800కి చేరింది. ఇది నిన్నటి ధరలతో పోల్చి చూస్తే 650 రూపాయల పెరగడం విశేషం. ఇదే సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,400 స్థాయికి చేరింది.
దీంతోపాటు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,050 స్థాయికి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70,629కు చేరింది. ఇక వెండి రేట్ల గురించి మాట్లాడితే కిలో వెండి రూ. 400 పెరిగి రూ. 89,760 స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
ఢిల్లీలో రూ. 76,800, రూ. 70,400
హైదరాబాద్‌లో రూ. 77,050, రూ. 70,629
విజయవాడలో రూ. 77,050, రూ. 70,629
ముంబైలో రూ. 76,930, రూ. 70,519
చెన్నైలో రూ. 77,150, రూ. 70,134
కోల్‌కతాలో రూ. 76,830, రూ. 70,428
బెంగళూరులో రూ. 76,990, రూ. 70,574
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 89,460
హైదరాబాద్‌లో రూ. 89,760
విశాఖపట్నంలో రూ. 89,760
ముంబైలో రూ. 89,620
చెన్నైలో రూ. 89,880
కోల్‌కతాలో రూ. 89,500
బెంగళూరులో రూ. 89,690
22, 24 క్యారెట్ల మధ్య తేడా మీకు తెలుసా?
బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్క్ ఇస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను 22 క్యారెట్ల బంగారంలో 9% కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం విలాసవంతమైనది అయినప్పటికీ, దీనిని ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించుకోలేరు. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారం విక్రయిస్తారు.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. అంతేకాదు వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలు కలిగి ఉండవు.
ఇవి కూడా చదవండి:
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 27 , 2024 | 06:37 AM