ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: న్యూ ఇయర్ ముందు మళ్లీ పెరిగిన బంగారం, వెండి రేట్లు

ABN, Publish Date - Dec 30 , 2024 | 06:32 AM

బంగారం, వెండి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా తగ్గిన ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. ఈ క్రమంలో నేడు ఉదయం నాటికి బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

gold silver rates today december 30th 2024

మీరు ఈరోజు బంగారం(gold), వెండి (silver) కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈరోజు బంగారం రేట్లను ఓసారి తనిఖీ చేయండి మరి. ఎందుకంటే కొత్త సంవత్సరానికి ముందు బంగారం, వెండి ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఈ క్రమంలో ఈరోజు (డిసెంబర్ 30న) ఉదయం 6.15 గంటల నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,490కు చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,980గా ఉంది. ఇది నిన్న 24 క్యారెట్ల బంగారం ధరతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఇక వెండి ధరల గురించి మాట్లాడితే నేడు కిలో వెండి ధర రూ.92,300కి చేరుకుంది. ఇది నిన్నటితో పోల్చితే వెయ్యికిపైగా పెరిగింది.


ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయంటే..

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 77,840కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 71,325కు చేరుకుంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,980కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,500కి చేరింది.

మరోవైపు యూపీ రాజధాని లక్నోలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,490కి చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,980 స్థాయిలో ఉంది. ఆగ్రాలోలో కూడా 22 క్యారెట్ గోల్డ్ రేటు రూ. 71,490 కాగా, 24 క్యారెట్ పసిడి రూ. 77,980గా ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


బంగారం రేట్ల విషయంలో

దేశంలో బంగారం ధరలు భారత రూపాయి విలువ మార్పు, US డాలర్‌ల మధ్య మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాల కారణంగా మారుతుంటుంది. ముఖ్యంగా దీపావళి వంటి ప్రధాన పండుగల సమయాలు, ప్రపంచ ఆర్థిక పరిణామాలతో సహా అనేక కీలకమైన అంశాలు భారతదేశంలో బంగారం ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అయితే మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే రోజువారీ బంగారం ధర గురించి మళ్లీ సమాచారాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోండి మరి.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే ముందు మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన. వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలు కలిగి ఉండవు.


ఇవి కూడా చదవండి:

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 30 , 2024 | 06:34 AM