ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Good news: గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారికి గుడ్‌న్యూస్

ABN, Publish Date - Oct 21 , 2024 | 04:25 PM

ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి ఇల్లు కట్టుకోలేనివారు చాలా మంది ఉంటారు. అలాంటివారు బ్యాంకు రుణాలపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే ఆఫర్లు ఉన్నప్పుడు గృహ రుణాలు తీసుకుంటే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది. అలాంటి ప్రత్యేక ఆఫర్ కోసం ఎదురుచూసేవారికి తరుణం ఆసన్నమైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి.

Home Loans

ఇల్లు కొనుగోలు చేయాలని లేదా నిర్మించుకోవాలని ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. దీపావళి పండుగకు ముందు పలు ప్రభుత్వరంగ బ్యాంకులు అదిరిపోయే ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించాయి. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ ఆఫర్‌ను పలు ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రకటించాయి. ఈ మేరకు ఆయా బ్యాంకులు తమ అధికారిక వెబ్‌సైట్‌లలో సమాచారాన్ని అందుబాటులో ఉంచాయి.


ప్రాసెసింగ్ ఫీజు మాఫీ ఆఫర్ ప్రకటించిన బ్యాంకుల జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నారు. డిసెంబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపాయి.


గృహ రుణాలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినప్పటికీ.. ప్రైవేట్ రంగ బ్యాంకులు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి ప్రత్యేక ఆఫర్లు ఏమీ ప్రకటించలేదు. గృహ రుణాల విషయంలో సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులే ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. సరసమైన గృహ రుణ రేట్లను అందించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అందుకే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో లోన్లు తీసుకునేందుకు కస్టమర్లు మొగ్గుచూపుతుంటారు.

కొన్ని ప్రైవేట్ బ్యాంకులు రూ.30 లక్షల వరకు లోన్‌పై కనీస వడ్డీ రేటును 8.70 శాతంగా ఆఫర్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ బ్యాంకులు అదే రుణాన్ని 30 సంవత్సరాల కాలపరిమితితో 8.35 శాతానికే అందిస్తున్నాయి.


గృహ రుణాలపై బ్యాంకుల వడ్డీ రేట్లు ఇవే

  1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వడ్డీ రేటు 8.50 శాతం - 9.65 శాతం

  2. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 9.5 శాతం

  3. పంజాబ్ నేషనల్ బ్యాంక్ - వడ్డీ రేటు 8.4 శాతం (మారుతుంటుంది)

  4. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ - వడ్డీ రేటు 8.75 శాతం

  5. ఐసీఐసీఐ బ్యాంక్ - వడ్డీ రేటు 9.25 శాతం నుంచి 9.65 శాతం

  6. కోటక్ మహీంద్రా బ్యాంక్ - వడ్డీ రేటు 8.75 శాతం నుండి ప్రారంభం

  7. బ్యాంక్ ఆఫ్ బరోడా - వడ్డీ రేటు 8.4 శాతం నుంచి 10.6% (సిబిల్ స్కోర్ ఆధారంగా)

  8. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - వడ్డీ రేటు 9.35 శాతం (రెపో రేటుతో అనుసంధానమైంది).


ఇవి కూడా చదవండి

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్.. ఎప్పుడంటే

Updated Date - Oct 21 , 2024 | 04:30 PM