ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

LIC SIP: పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ నుంచి రూ. 100 సిప్

ABN, Publish Date - Sep 21 , 2024 | 09:19 AM

ఇటివల కాలంలో అనేక మంది మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్ఐసీ కూడా ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ నుంచి మ్యూచువల్ ఫండ్ రూ. 100 సిప్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించారు.

LIC Rs 100 sips

LIC మ్యూచువల్ ఫండ్ అక్టోబర్ మొదటి వారంలో చిన్న మొత్తంలో SIPని ప్రారంభించాలని యోచిస్తోంది. కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆర్‌కే ఝా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ SIP రూ. 100 నుంచి మొదలవుతుందని చెప్పారు. పెట్టుబడిదారుల(investments) భాగస్వామ్యాన్ని పెంచేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చిన్న SIPలను సూచిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొన్ని ఫండ్స్ మాత్రమే రూ.500 లోపు SIPలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ కనీస రోజువారీ SIP మొత్తాన్ని ప్రస్తుత పరిమితి రూ. 300 నుంచి రూ. 100కి తగ్గించాలని యోచిస్తోంది. నెలవారీ SIP రూ. 1,000 నుంచి రూ. 200కి తగ్గనుంది.


లక్ష కోట్లకు

సిప్ మొత్తాన్ని తగ్గించేందుకు అక్టోబర్ 7న సవరణ తీసుకువస్తామని ఝా తెలిపారు. ఎల్‌ఐసీ ఎంఎఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్ (ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్) కొత్త ఎన్‌ఎఫ్‌ఓ ఆఫర్ చేసిన అనంతరం ఆయన ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఫండ్ హౌస్ నిర్వహణలో ఉన్న ఆస్తులను ప్రస్తుతం రూ. 35,000 కోట్ల నుంచి 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1 లక్ష కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఈక్విటీ విభాగంలో మా బృందం సామర్థ్యాన్ని పెంచామని, AUMని పెంచేందుకు 30 బీ నగరాల్లో కొత్త శాఖలతో డిజిటల్ సామర్థ్యం పెంపుదలపై దృష్టి పెడుతున్నామని ఝా అన్నారు.


మల్టీ అసెట్ ఫండ్

ఈ క్రమంలో తాము మరో 50 కొత్త శాఖలను ప్రారంభించాలనుకుంటున్నామన్నారు. డెహ్రాడూన్, జంషెడ్‌పూర్, జోధ్‌పూర్, దుర్గాపూర్ మొదలైన నగరాల్లో ఈ శాఖలు ఉంటాయన్నారు. నెల రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ల కోసం కూడా కొత్త యాప్‌ను కూడా తీసుకురానున్నట్లు వెల్లడించారు. కంపెనీ గతేడాది నవంబర్‌లో ఇన్వెస్టర్ల కోసం యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది రాబోయే రెండు త్రైమాసికాల కోసం రెండు కొత్త ఫండ్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందులో మల్టీ అసెట్ ఫండ్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఉన్నాయి.


ఆసక్తి

ఝా ప్రకారం LIC MFలో ఈక్విటీల చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ యోగేష్ పాటిల్ ప్రకారం మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్ ప్రధానంగా స్మాల్, మిడ్ క్యాప్ పరిధిలో 50 నుంచి 55 స్టాక్‌లను కలిగి ఉండటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు దిగుమతి ప్రత్యామ్నాయం, ఆటోమొబైల్ తయారీ, ఫార్మాస్యూటికల్స్ సహా ఇతర రంగాలలో పనిచేసే కంపెనీల ఈక్విటీలలో పెట్టుబడి పెట్టనున్నారు. ప్రస్తుత కాలంలో అనేక మంది మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఎల్ఐసీ కూడా ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తుంది.


ఇవి కూడా చదవండి:

iPhone 16: ఐఫోన్ 16కి విపరీతమైన క్రేజ్.. డే1 సేల్స్ ఎలా ఉన్నాయంటే..

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే


Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 21 , 2024 | 09:23 AM