ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాత కార్లపై జీఎస్‌టీ..

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:49 AM

పాత లేదా వాడిన కార్లను విక్రయించే సందర్భంలో ఆర్జించిన లాభంపైనే జీఎ్‌సటీ వర్తిస్తుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. అంటే, వాహన ధరలో తరుగుదల సర్దుబాటు అనంతర నికర విలువ కంటే...

తరుగుదల అనంతర నికర విలువ కంటే

అధిక ధరకు విక్రయిస్తేనే..

న్యూఢిల్లీ: పాత లేదా వాడిన కార్లను విక్రయించే సందర్భంలో ఆర్జించిన లాభంపైనే జీఎ్‌సటీ వర్తిస్తుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. అంటే, వాహన ధరలో తరుగుదల సర్దుబాటు అనంతర నికర విలువ కంటే అధిక మొత్తానికి విక్రయించగా ఆర్జించిన లాభంపై జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది. పాత లేదా వాడిన వాహనాల (ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ సహా) విక్రయాలపై ఇకపై ఏకరీతిగా 18 శాతం జీఎ్‌సటీ విధించాలని గత శనివారం సమావేశమైన జీఎ్‌సటీ మండలి నిర్ణయించింది. ఆదాయం పన్ను చట్టం 1961లో సెక్షన్‌ 32 కింద తరుగుదలను క్లెయిమ్‌ చేసుకున్న రిజిస్టర్డ్‌ వ్యక్తులు లేదా విక్రేతలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి మరో వ్యక్తికి పాత కారును విక్రయించిన సందర్భంలో మాత్రం జీఎ్‌సటీ వర్తించదు. కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం..


  • రిజిస్టర్డ్‌ వ్యక్తి లేదా విక్రేత ఎవరికైనా తన వాహనాన్ని రూ.15 లక్షలకు విక్రయించాడని అనుకుందాం. ఆ వాహనం అసలు ఖరీదు రూ.20 లక్షలు. కాగా, ఇప్పటికే కారుపై రూ.8 లక్షల తరుగుదలను క్లెయిమ్‌ చేశాడనుకుంటే, నికర విలువ రూ.12 లక్షలు అవుతుంది. ఈ సందర్భంలో వాహన విక్రయ ధర (రూ.15 లక్షలు), తరుగుదల అనంతరం నికర విలువ (రూ.12 లక్షలు) మధ్య వ్యత్యాసం రూ.3 లక్షలపై 18 శాతం జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది.

  • రిజిస్టర్డ్‌ వ్యక్తి లేదా విక్రేత రూ.20 లక్షల కారుపై ఇప్పటికే రూ.8 లక్షల తరుగుదల క్లెయిమ్‌ చేసుకోగా రూ.12 లక్షల నికర విలువ చేసే కారును రూ.10 లక్షలకే విక్రయించాడనుకుంటే, ఈ సందర్భంలో నికర విలువ కంటే విక్రయ ధర తక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

Updated Date - Dec 25 , 2024 | 04:49 AM