Alert: జీఎస్‌టీ రిటర్న్ ఫైలింగ్ గడువు పొడిగింపు..వెంటనే దాఖలు చేయండి
ABN, Publish Date - Apr 12 , 2024 | 02:00 PM
పాన్ మసాలా, గుట్కా లాంటి పొగాకు ఉత్పత్తుల తయారీదారుల కోసం రిజిస్ట్రేషన్, నెలవారీ రిటర్న్‌ల దాఖలు కోసం ప్రత్యేక ప్రక్రియను అమలు చేయడానికి ప్రభుత్వం మే 15 వరకు గడువును పొడిగించింది. మరోవైపు పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ రిటర్న్‌ను ఫైల్ చేయడం తప్పనిసరి. ఈ గడువు తేదీని ఏప్రిల్ 12 వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా రిటర్నులు దాఖలు చేయనివారు ఉంటే దాఖలు చేయాలని కోరారు.
ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త రిజిస్ట్రేషన్, నెలవారీ రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను అమలు చేస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు & కస్టమ్స్ (CBIC) గతంలో ప్రకటించింది. ఈ క్రమంలో పాన్ మసాలా, పొగాకు(pan masala, gutkha) ఉత్పత్తుల తయారీదారుల రిజిస్ట్రేషన్, రికార్డ్ కీపింగ్, నెలవారీ రిపోర్టులపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాన్ మసాలా, గుట్కా లాంటి పొగాకు ఉత్పత్తుల తయారీదారులు రిజిస్ట్రేషన్, నెలవారీ రిటర్న్ ఫైలింగ్ కోసం ప్రత్యేక విధానాన్ని అమలు చేయడానికి మే 15 వరకు 45 రోజులు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా విఫలమైతే లక్ష రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. గతంలో ఈ తేదీ ఏప్రిల్ 1గా ఉండేది. నోటిఫికేషన్ పొడిగింపు కోసం ఎటువంటి కారణం చెప్పనప్పటికీ, ప్రక్రియలను పూర్తి చేయడానికి GST ఫైలింగ్ తప్పనిసరి అని వెల్లడించింది.
మరోవైపు పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ(GST) రిటర్న్‌ను ఫైల్(return filing) చేయడం తప్పనిసరి. అయితే దీని గడువు ఏప్రిల్ 10, 2024 వరకు ఉండగా బుధవారం పన్ను చెల్లింపుదారులు జీఎస్టీని దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా అనేక మంది రిటర్నులు దాఖలు చేయలేకపోయారు.
దీంతో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి GST నెట్‌వర్క్ GSTR-1 కోసం రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు తేదీని ఏప్రిల్ 12 వరకు పొడిగించినట్లు సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రకటించింది. అంటే పన్ను చెల్లింపుదారులు ఈరోజు కూడా జీఎస్టీని ఫైల్ చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా రిటర్నులు దాఖలు చేయనివారు ఉంటే వెంటనే దాఖలు చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి:
SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి
Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం
Updated Date - Apr 12 , 2024 | 02:02 PM