ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Retirement Plan: రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేశారా.. నెలకు రూ.902 చెల్లిస్తే గ్యారంటీ పెన్షన్

ABN, Publish Date - Aug 09 , 2024 | 02:47 PM

ప్రస్తుతం మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా అయితే రిటైర్ మెంట్(retirement) గురించి కూడా ఓసారి ఆలోచించండి. ఎందుకంటే పదవి విరమణ తర్వాత జీవితాన్ని గడపాలంటే నెలకు కనీసం 5 నుంచి 10 వేల రూపాయల వరకు ఉండాలి. ఆ సమయంలో డబ్బుల కోసం ఎవరిపై ఆధారపడకుండా మీరు ఇప్పటి నుంచే చిన్న మొత్తంలో పొదుపు చేయడం ద్వారా రిటైర్ మెంట్ అయిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉండవచ్చు.

atal pension yojana

ప్రస్తుతం మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా అయితే రిటైర్ మెంట్(retirement) గురించి కూడా ఓసారి ఆలోచించండి. ఎందుకంటే పదవి విరమణ తర్వాత జీవితాన్ని గడపాలంటే నెలకు కనీసం 5 నుంచి 10 వేల రూపాయల వరకు ఉండాలి. ఆ సమయంలో డబ్బుల(money) కోసం ఎవరిపై ఆధారపడకుండా మీరు ఇప్పటి నుంచే చిన్న మొత్తంలో పొదుపు చేయడం ద్వారా రిటైర్ మెంట్ అయిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. ఈ క్రమంలో అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ల వయస్సు నుంచి స్థిర ఆదాయాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 9, 2015న అటల్ పెన్షన్ యోజన స్కీంను ప్రారంభించారు. ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది.


60 ఏళ్ల నుంచి

అటల్ పెన్షన్ యోజన ఖాతాను 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ పథకం కింద చేరిన సభ్యులకు 60 ఏళ్ల వయస్సు నుంచి నెలకు రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు జీవితకాల పెన్షన్ లభిస్తుంది. ఇది కంట్రిబ్యూట్ చేసే మొత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక వేళ దీనిని తీసుకున్న వ్యక్తి మధ్యలో మరణిస్తే అతని భార్య లేదా భర్త పెన్షన్ మొత్తాన్ని అందుకుంటారు. ఇద్దరి మరణానంతరం డిపాజిట్ చేసిన మొత్తం 60 సంవత్సరాల వయస్సు వరకు నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది. ఈ పథకం పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండదు. ముఖ్యంగా పేదల కోసం భారత ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.


వయస్సు 35 అయితే

అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి ఆధారంగా పెన్షన్ మొత్తం నిర్ణయించబడుతుంది. అంటే త్వరగా పెట్టుబడి పెట్టడం ద్వారా వారు తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎవరైనా 40 ఏళ్ల తర్వాత పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే నెలకు రూ.291 నుంచి రూ.1454 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వారికి రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ వస్తుంది. ఈ క్రమంలో 60 ఏళ్ల తర్వాత నెలకు 5 వేల రూపాయల పెన్షన్ కావాలంటే మీరు 20 ఏళ్ల పాటు నెలకు రూ.902 చెల్లించాలి. ప్రస్తుతం మీ వయస్సు 35 అయితే 20 ఏళ్లు చెల్లించిన తర్వాత మీకు పెన్షన్ తిరిగి వస్తుంది.

దరఖాస్తు

దరఖాస్తుదారు ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాను కూడా కలిగి ఉండాలి. దీంతో పాటు చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ కూడా ఉండాలి. అటల్ పెన్షన్ యోజన స్కీం కోసం దరఖాస్తు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో చేయవచ్చు. ఆఫ్‌లైన్ స్కీమ్ కోసం దగ్గరలోని బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు వెళ్లి తీసుకోవచ్చు ఈ స్కీమ్‌లో మీరు సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా కూడా పొందుతారు.


ఇవి కూడా చదవండి:

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 09 , 2024 | 03:21 PM

Advertising
Advertising
<