ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BSNL Offer: 365 రోజుల వ్యాలిడిటీతో బంపరాఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

ABN, Publish Date - Nov 05 , 2024 | 01:55 PM

జులై నెలలో ప్రైవేటు టెలికం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) టారిఫ్ రేట్లు పెంచిన నాటి నుంచి చాలా మంది యూజర్లు బీఎస్ఎన్‌ఎల్‌లోకి పోర్ట్ అయ్యారు. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం ద్వారా బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే చాలా మంది కస్టమర్లను పొందింది. ఈ క్రమంలో తాజాగా దీపావళి ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించింది.

BSNL

ఆకర్షణీయమైన ఆఫర్ల ద్వారా కస్టమర్లను ఆకట్టుకొని పూర్వవైభవాన్ని సంతరించుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వరంగ టెలికం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ (BSNL) మరో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దీపావళి పండుగ సీజన్‌లో అన్ని ప్రధాన టెలికం ఆపరేటర్లు ప్రకటించిన ఆఫర్లు ముగిసిపోయినప్పటికీ.. నవంబర్ 7 వరకు అందుబాటులో ఉండేలా దీపావళి ప్రత్యేక ఆఫర్‌ను బీఎస్ఎన్‌ఎల్ పరిచయం చేసింది.


దీపావళి ప్రత్యేక ఆఫర్ వివరాలు ఇవే..

365 రోజుల వ్యాలిడిటీతో రూ.1,999 రీఛార్జ్ ప్లాన్‌పై రూ.100 తగ్గింపును అందిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. యూజర్లు రూ.1,899కే ఈ ఆఫర్‌ను పొందవచ్చని తెలిపింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 600జీబీ డేటా లభిస్తాయని తెలిపింది. ఇక రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా అందిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ప్రకటించింది.


‘‘దీపావళి తర్వాత ప్రత్యేక ఆఫర్!. రూ.1999 రీఛార్జ్ వోచర్‌పై రూ.100 తగ్గింపు పొందండి. ఇప్పుడు కేవలం రూ.1899 రీఛార్జ్ చేసుకోండి! ఒక సంవత్సరం పాటు 600 జీబీ డేటా, అపరిమిత కాల్‌లు, గేమ్స్, మ్యూజిక్, మరిన్ని బెనిఫిట్స్ ఆస్వాదించండి. ఈ పండుగ ఆఫర్ నవంబర్ 7, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఈరోజే రీఛార్జ్ చేసుకోండి. మీ డిజిటల్ జీవితాన్ని బీఎస్ఎన్ఎల్ మరింత ప్రకాశవంతం చేయనివ్వండి!’’ అని ఎక్స్ ప్రకటనలో బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.


కాగా జులై నెలలో ప్రైవేటు టెలికం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) టారిఫ్ రేట్లు పెంచిన నాటి నుంచి చాలా మంది యూజర్లు బీఎస్ఎన్‌ఎల్‌లోకి పోర్ట్ అయ్యారు. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం ద్వారా బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే చాలా మంది కస్టమర్లను పొందింది. ఈ క్రమంలో దీపావళి ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించింది. రిలయన్స్ జియో ప్రకటించిన దీపావళి ఆఫర్‌తో పోల్చితే బీఎస్ఎన్ఎల్ ఆఫర్‌లో ప్రయోజనాలు ఆకర్షణీయంగా ఉన్నాయి.


కస్టమర్లను ఆకర్షించడంపై దృష్టిసారించిన బీఎస్ఎన్ఎల్ ఇటీవలే వయాసాట్ (Viasat) సహకారంతో డీ2డీ (D2D) సేవల ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది. దీంతో వినియోగదారులు త్వరలోనే సిమ్ కార్డ్ అవసరం లేకుండా నేరుగా ఫోన్ల మధ్య ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ఇటీవలే తెలిపింది. ట్రయల్ రన్‌లో భాగంగా ఇటీవల జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా ఏకంగా 36,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంబర్‌కు విజయవంతంగా ఫోన్ చేశారు.


ఇవి కూడా చదవండి

ఇవాళ విరాట్ కోహ్లీ బర్త్‌డే.. ఎన్నేళ్లు నిండాయో తెలుసా

రోహిత్‌ శర్మను ఉద్దేశించి సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

విమానాల్లో ప్రయాణిస్తుంటారా.. కీలక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

అమెరికాలో ఇవాళే అధ్యక్ష ఎన్నికలు.. ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా

నాలుగేళ్ల తర్వాత తొలిసారి.. చైనా సరిహద్దులో..

ఈ చిన్న మెలకువలు తెలిస్తే చాలు.. మిమ్మల్ని ఎవరూ డిజిటల్ అరెస్ట్ చేయలేరు

For more Sports News and Telugu News

Updated Date - Nov 05 , 2024 | 01:56 PM