ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fake Products: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ప్రొడక్ట్ నకిలీదా లేక నిజమైనదో ఇలా గుర్తించండి

ABN, Publish Date - Jul 10 , 2024 | 11:25 AM

ప్రస్తుత కాలంలో అనేక మంది ఆన్‌లైన్ షాపింగ్(online shopping) చేసేందుకే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇదే సమయంలో ఇటివల కాలంలో ఆన్‌లైన్ ఆర్డర్లలో నకిలీ ఉత్పత్తులు కూడా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో నకిలీ ఉత్పత్తులను(Fake Products) ఎలా గుర్తించాలి, ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి నియమ, నిబంధనలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

how to find fake product online

ప్రస్తుత కాలంలో అనేక మంది ఆన్‌లైన్ షాపింగ్(online shopping) చేసేందుకే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇదే సమయంలో ఇటివల కాలంలో ఆన్‌లైన్ ఆర్డర్లలో నకిలీ ఉత్పత్తులు కూడా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ ఉత్పత్తులను(Fake Products) ఎలా గుర్తించాలి, ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి నియమ, నిబంధనలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీటి గురించి మీరు తెలుసుకోవడం ద్వారా మీరు ఫేక్ ఉత్పత్తుల నుంచి తప్పించుకోవచ్చు.

పేరులో మార్పు

మీరు షాపింగ్ చేసే సమయంలో ముందుగా ఇ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తి పేరును చెక్ చేయండి. దానిలో పొరపాటు ఉంటే అది నకిలీగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటివల కాలంలో కొన్ని కంపెనీలు బ్రాండ్ పేరుకు సమానమైన పేర్లను ఉపయోగించి అనేక ఉత్పత్తులను తయారు చేసి ఆన్‌లైన్ విధానంలో విక్రయిస్తున్నారు. కాబట్టి బ్రాండెడ్ ఉత్పత్తుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆయా పేర్లను చెక్ చేసుకోవాలి.


సమీక్షలు

ప్రతి ఆన్‌లైన్ సైట్‌లో ఆయా ఉత్పత్తుల గురించి కస్టమర్ సమీక్షలు ఉంటాయి. మీరు కొనుగోలు చేయడానికి ముందు ఒకసారి సమీక్షలను తనిఖీ చేయండి. ఆయా ఉత్పత్తులను గతంలో తీసుకున్న కస్టమర్‌లు ఆ ఉత్పత్తి ఎలా ఉందో చెబుతారు. వీటిని చూసి మీరు కొనుగోలు చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. కొన్ని విఫలమైన ఉత్పత్తులకు తక్కువ ధరలు నిర్ణయించి సేల్ చేస్తారు. కాబట్టి సమీక్షలు తనిఖీ చేయడం ద్వారా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఉత్పత్తుల గురించి ఫీడ్ బ్యాక్ తెలుసుకోవచ్చు.


రిటర్న్ ఉందా

కొన్ని వెబ్‌సైట్లలో విక్రయించే ఉత్పత్తులకు మంచి తగ్గింపు ధరలు ఉంటాయి. ఆ క్రమంలో వాటికి డెలివరీ తర్వాత రిటర్న్ సౌకర్యం ఉందో లేదో చెక్ చేయాలి. భారీగా తగ్గింపు ప్రకటించిన పలు ఉత్పత్తులకు దాదాపు వాటిని తిరిగి తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెబ్‌సైట్‌లో రిటర్న్ పాలసీ ఉందా అనేది తనిఖీ చేసుకోవాలి.

పార్శిల్ వచ్చిన వెంటనే తనిఖీ

మీరు ఏదైనా ఇ-కామర్స్ సైట్ నుంచి ఉత్పత్తిని ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ వచ్చిన వెంటనే తనిఖీ చేయండి. ఎందుకంటే ప్యాకేజీని ఆలస్యంగా ఓపెన్ చేస్తే రిటర్న్ పంపడం లేదా ఉత్పత్తి మోసాల గురించి ఫిర్యాదు చేసేందుకు మరింత ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు ప్యాకెట్ లోపల బంగాళాదుంపలు, రాళ్ల వస్తే వాటిపై ఫిర్యాదు చేస్తే మీకు వెంటనే ఫీడ్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది.


ప్రముఖ సైట్లలోనే

మార్కెట్‌లో ఉన్న ప్రసిద్ధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలలోనే ఎల్లప్పుడూ ఆన్‌లైన్ షాపింగ్ చేయండి. ఈ కంపెనీల యూజర్ బేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాయి. కాబట్టి మీరు Amazon, Flipkart, Myntra లేదా ఇతర ప్రముఖ వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే షాపింగ్ చేయడం ఉత్తమం.

కోర్టును కూడా..

నకిలీ ఆహార ఉత్పత్తులను గుర్తించేందుకు ఆహార నియంత్రణ సంస్థలు FSSAI స్మార్ట్ కన్స్యూమర్ యాప్ సహాయం కూడా తీసుకోవచ్చు. మీరు ఈ యాప్ నుంచి QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా QR నంబర్‌ను నమోదు చేసుకోవాలి. దీని తర్వాత ఉత్పత్తి తయారీ వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా ఉత్పత్తి అసలుదా లేదా నకిలీనా అని గుర్తించవచ్చు. మీరు ఈ యాప్‌ని Google Play Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నకిలీ ఉత్పత్తుల నుంచి రక్షించడానికి ఎలక్ట్రానిక్, FMCG కంపెనీలు QR కోడ్‌లు, హోలోగ్రామ్‌లను తయారు చేస్తాయి. వాటి ద్వారా నిజమైన, నకిలీ వాటిని గుర్తించవచ్చు. మీరు నకిలీ ఉత్పత్తిని స్వీకరించి, కంపెనీ దానిని తిరిగి ఇవ్వకపోతే, మీరు వినియోగదారుల కోర్టును కూడా ఆశ్రయించవచ్చు.


ఇది కూడా చదవండి:

Stock Markets: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్


ఈక్విటీ మదుపరుల సంపద రూ.451 లక్షల కోట్లు


సూక్ష్మ రుణాలు రూ.2 లక్షలు మించొద్దు


For Latest News and Business News click here

Updated Date - Jul 10 , 2024 | 11:28 AM

Advertising
Advertising
<