ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి

ABN, Publish Date - Aug 31 , 2024 | 03:15 PM

ప్రస్తుతం ఐటీఆర్ వాపసు జాప్యం అనేది చాలా మంది పన్ను చెల్లింపుదారులను ఇబ్బంది పెడుతున్న సమస్య. అయితే అలాంటి వారికి డబ్బు వాపసు ఎప్పుడు వస్తుంది, రీఫండ్ ఆలస్యం అయితే ఏం చేయాలనే విషయాలను ఇక్కడ చుద్దాం.

ITR refund update

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసిన తర్వాత వాపసు జాప్యం అనేది ప్రస్తుతం చాలా మంది పన్ను చెల్లింపుదారులను ఇబ్బంది పెడుతున్న సమస్య. అలాంటి వారికి వాపసు డబ్బు ఎప్పుడు వస్తుంది, రీఫండ్ ఆలస్యం అయితే ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (EVC) ద్వారా లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC) దగ్గర సంతకం చేసిన ITR-Vని సమర్పించడం ద్వారా పన్ను చెల్లింపుదారు తన ITR ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయకపోతే వాపసు ప్రక్రియ ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు.


మీ వివరాల్లో లోపం ఉంటే

అంతేకాదు పన్ను చెల్లింపుదారు రిటర్న్ దాఖలు చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు రిటర్న్‌ను ధృవీకరించవలసి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) ప్రాసెస్ చేయడం జాప్యం కారణంగా కూడా రీఫండ్‌లు ఆలస్యం కావచ్చని తెలిపారు. ITRలోని వ్యత్యాసాలు, ఆదాయంలో మార్పులు, బ్యాంక్ ఖాతా సమాచారంలో లోపం, పాన్ వివరాలలో లోపం మొదలైనవి కూడా వాపసులో జాప్యానికి కారణం కావచ్చని అధికారులు చెబుతున్నారు. ఇవి కాకుండా 26AS, AISతో ఆదాయం సరిపోలకపోవడం వంటివి కూడా వాపసు ఆలస్యానికి దారితీయవచ్చన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ రిఫండ్‌లను జారీ చేసే ముందు ఆదాయపు పన్ను రిటర్న్‌లలో వివరాలను ధృవీకరించడానికి లెటేస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తుందని అధికారులు తెలిపారు.


ఇలా చేయండి

రీఫండ్ పొందడంలో జాప్యం జరిగితే ముందుగా మీరు ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీ ఖాతా స్థితిని తనిఖీ చేయాలని అధికారులు సూచించారు. అది ప్రాసెసింగ్ ప్రస్తుత దశ, మీ దృష్టికి అవసరమైన ఏవైనా సమస్యల గురించి మీకు సమాచారాన్ని అందిస్తుందన్నారు. ఆలస్యం గురించి వివరించబడకపోతే మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని 'ఇ-రిడ్రెస్సల్' విభాగం ద్వారా ఫిర్యాదును చేయవచ్చని సూచించారు. లేదంటే అప్‌డేట్‌ల కోసం CPC హెల్ప్‌లైన్‌ని కూడా సంప్రదించవచ్చన్నారు.


వచ్చే ఏడాది నాటికి

బ్యాంక్ ఖాతా సరిగ్గా సరిపోలడం వల్ల రీఫండ్ విఫలమైతే ముందుగా ఆదాయపు పన్ను పోర్టల్‌లో మీ బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేయండి. ఆ తర్వాత పన్ను రీఫండ్‌ను మళ్లీ జారీ చేయాలని అభ్యర్థించండి. ఆదాయపు పన్ను రీఫండ్ రీ ఇష్యూ కోసం ITR ఇ ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అయ్యి 'సర్వీసెస్' ట్యాబ్‌కు వెళ్లి 'రీఫండ్ రీఇష్యూ' బటన్‌పై క్లిక్ చేసి అభ్యర్థించాలని అధికారులు సూచించారు. దీని తర్వాత మీరు రీఫండ్‌ని స్వీకరించాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.

బ్యాంక్ ఖాతా

మీ బ్యాంక్ ఖాతా ధృవీకరించబడకపోతే, ముందుగా అది ధృవీకరించబడాలి. ఆపై కొనసాగించండి. ధృవీకరించడానికి ఆధార్ OTP, EVC లేదా DSC వివరాలను ఎంచుకోండి. అయితే ఆదాయపు పన్ను శాఖ మిలియన్ల కొద్దీ రిటర్న్‌లను ప్రాసెస్ చేస్తున్న నేపథ్యంలో పలువురు పన్ను చెల్లింపుదారులకు 2025 చివరి నాటికి ఈ పని పూర్తి కావచ్చని అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

Telegram: మరికొన్ని రోజుల్లో టెలిగ్రామ్ యాప్ బ్యాన్?.. కారణాలివేనా..

Google Pay: గూగుల్ పే నుంచి కొత్తగా ఆరు ఫీచర్లు.. అవేంటంటే..


Vistara: ప్రయాణికులకు అలర్ట్.. ఈ విమాన టిక్కెట్స్ బుకింగ్ బంద్


Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 31 , 2024 | 03:17 PM

Advertising
Advertising