EMI Bounced: మీ లోన్ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి
ABN, Publish Date - May 19 , 2024 | 02:48 PM
సాధారణంగా అనేక మంది మధ్య తరగతి ఉద్యోగులు లోన్స్(loans) తీసుకుని గడువు తేదీలోపు చెల్లించలేకపోతారు. అలాంటి క్రమంలో ప్రభుత్వ బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు గడువులోగా చెల్లించకుంటే రోజులను బట్టి రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తాయి. ఇలాంటి క్రమంలో ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా అనేక మంది మధ్య తరగతి ఉద్యోగులు లోన్స్(loans) తీసుకుని గడువు తేదీలోపు చెల్లించలేకపోతారు. అలాంటి క్రమంలో ప్రభుత్వ బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు గడువులోగా చెల్లించకుంటే రోజులను బట్టి రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తాయి. అయితే ఆ మొత్తం సంబంధిత చెల్లింపుదారులకు భారంగా మారుతుంది. అలాంటి క్రమంలో మీ లోన్ ఈఎంఐ బోన్స్(EMI Bounced) నుంచి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మొదటి వాయిదా బౌన్స్ అయిన వెంటనే రుణం ఇచ్చే బ్యాంకుకు వెళ్లి సంబంధిత మేనేజర్‌తో మాట్లాడాలి. మీరు వెంటనే చెల్లించలేని పరిస్థితి ఉంటే కొన్ని నెలలు మీ నెలవారీ ఈఎంఐలు వాయిదా వేయాలని కోరాలి. మీకు నిధులు ఏర్పాటైన తర్వాత ఆ మొత్తాన్ని చెల్లించుకోవచ్చు.
ప్రస్తుత రుణం వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే మీరు మరొక బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకి రుణం తీసుకుని ఆ మొత్తాన్ని చెల్లించుకోవడానికి ప్రయత్నించండి
లేదంటే ఎక్కడి నుండైనా మీకు అదనపు ఆదాయం సమకూరితే ఆ మొత్తాన్ని లోన్ ప్రీపేమెంట్ కోసం ఉపయోగించవచ్చు
గృహ రుణం వంటి పెద్ద రుణాల విషయంలో ప్రారంభ సంవత్సరాల్లో ముందస్తు చెల్లింపు చేయడం ద్వారా రుణ కాల వ్యవధిని గణనీయంగా తగ్గించుకోవచ్చు
దీంతోపాటు ఏదైనా లోన్ తీసుకునే ముందు బ్యాంకు అగ్రిమెంట్ రూల్స్ చూడకుండా సంతకం చేయవద్దు
మీ నెలవారీ వాయిదా 60 రోజులు బౌన్స్ అయితే మీకు బ్యాంక్ నుంచి ఏదైనా నోటీసు వస్తుంది. అప్పుడు మీరు ఏ కారణంతో రుణం చెల్లించలేకపోతున్నారో బ్యాంకు అధికారులకు తెలియజేయండి
ఈ తుది నోటీసు కాల పరిమితి 30 రోజులు. దీని తర్వాత కూడా మీరు రుణాన్ని తిరిగి చెల్లించనట్లయితే SARFAESI చట్టం ప్రకారం మీ ఆస్తిని వేలం వేసే ప్రక్రియ బ్యాంక్‌కు ఉంటుంది. కానీ పర్సనల్ లోన్స్ విషయంలో అలా జరగదు.
మీ లోన్ ఈఎంఐలు బౌన్స్ అయితే ఈ ప్రభావం మీ సిబిల్ స్కోర్‌పై చూపుతుంది. క్రమంగా మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది
ఇది కూడా చదవండి:
Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
Read Latest Business News and Telugu News
Updated Date - May 19 , 2024 | 02:51 PM