ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Economy: 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్.. సాధ్యమేనా..

ABN, Publish Date - Dec 12 , 2024 | 03:28 PM

ఇండియా త్వరలోనే 7000 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాల వల్ల భారత్ ఆ దిశగా వెళుతుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Indian Economy

భారత్ 2030 నాటికి 7000 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది. కానీ అందుకోసం మాత్రం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై (Infrastructure Investment) 2,200 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రివైవింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ఈ నివేదికను సమర్పించిన క్రమంలో వెల్లడించింది. నివేదిక ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి US $70 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు 2024-2030 మధ్య 10.1 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR) సాధించాలని ప్రస్తావించింది.


విస్తృతమైన ప్రయత్నాలు

ఈ క్రమంలో లాజిస్టిక్స్ పనితీరు సూచిక (LPI)లో భారత్ ర్యాంకింగ్ మెరుగుపడుతుందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) శిశిర్ బైజాల్ తెలిపారు. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరిగిన బడ్జెట్‌పై ప్రభావం చూపించిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ మౌలిక సదుపాయాలు గణనీయమైన విస్తరణ కోసం విస్తృతమైన ప్రయత్నాలు చేశాయని స్పష్టం చేశారు. దీని వల్ల భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధిలో చురుగ్గా పాల్గొనేందుకు ప్రైవేట్ కంపెనీలకు ఆస్కారం పెరుగుతుందని బైజల్ స్పష్టం చేశారు.


మౌలిక సదుపాయాలపై..

అంతేకాదు ఈ పరిధిని పరిమితం చేసే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ అన్నారు. ఈ క్రమంలో దేశంలో దీర్ఘకాలిక స్థిరమైన ఆర్థిక వృద్ధిని తీసుకురావడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రైవేట్ పెట్టుబడి కేటాయింపులను ప్రేరేపించడానికి ప్రధాన చర్యలు తీసుకోవాలని సూచించారు. మౌలిక సదుపాయాల పెట్టుబడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా ఆధారపడటం వల్ల ద్రవ్యలోటు లక్ష్యాలపై ఒత్తిడి పెరగవచ్చని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచడం వల్ల ఆర్థిక లోటు లక్ష్యాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని కన్సల్టెంట్ నివేదిక అభిప్రాయపడింది.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 12 , 2024 | 03:29 PM