ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Indias Juggernaut: అత్యంత ప్రభావవంతమైన కంపెనీల లిస్టు విడుదల చేసిన 'టైమ్'.. భారత్ నుంచి ఏవంటే?

ABN, Publish Date - May 31 , 2024 | 11:25 AM

టైమ్ మ్యాగజైన్(TIME Magazine) 2024కి గానూ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries), టాటా గ్రూప్(TATA Group), సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: టైమ్ మ్యాగజైన్(TIME Magazine) 2024కి గానూ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries), టాటా గ్రూప్(TATA Group), సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ లిస్టులో రెండో సారి తన స్థానాన్ని పదిలపరుచుకుంది.

ఈ ఘనతను TIME మ్యాగజైన్ 'ఇండియాస్ జగ్గర్నాట్'గా కీర్తించింది. Jio ప్లాట్‌ఫారమ్‌ 2021లో అత్యంత ప్రభావవంతమైన కంపెనీల జాబితాలో ఉండేది. "రిలయన్స్ ఇండస్ట్రీస్‌ని 58 సంవత్సరాల క్రితం ధీరూభాయ్ అంబానీ టెక్స్‌టైల్, పాలిస్టర్ కంపెనీగా స్థాపించారు. ప్రధాని మోదీ పారిశ్రామిక వేత్తల కోసం తీసుకువచ్చిన సరళతర విధానాలతో రిలయన్స్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ప్రస్తుతం ఆ కంపెనీ USD 200 బిలియన్ కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ని కలిగి ఉంది" అని టైమ్ వెల్లడించింది.


టాటా గ్రూప్ ప్రయాణం

1868లో స్థాపితమైన టాటా గ్రూప్, విభిన్న పోర్ట్‌ఫోలియో, గ్లోబల్ ప్రభావాన్ని ప్రదర్శిస్తూ 'టైటాన్స్' విభాగంలో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఎన్ చంద్రశేఖరన్ నాయకత్వంలో టాటా కంపెనీలో అనేక మార్పులు వచ్చినట్లు టైం వెల్లడించింది. కొన్నాళ్లకు టాటా కంపెనీ AI, సెమీకండక్టర్ చిప్‌ల తయారీ రంగంలోకి ప్రవేశించినట్లు చెప్పింది.

"పోటీదారులు కొత్త వ్యాపారాలను విస్తరిస్తుండటంతో ఆ పోటీని కొనసాగించడానికి టాటా యాజమాన్యం చాలా కష్టపడింది.కుటుంబంతో వ్యక్తిగత సంబంధాలు లేకపోయినా చంద్రశేఖరన్ కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి కంపెనీని విజయపథంలో నడిపారు" అని టైం మ్యాగజైన్ పేర్కొంది.


సీరం ఇన్‌స్టిట్యూట్ కీలక పాత్ర

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా గుర్తింపు పొందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్‌కేర్ రంగంలో గణనీయమైన సహకారం అందించిందని టైం మ్యాగజైన్ ప్రశంసించింది. తట్టు, పోలియో, హెచ్‌పీవీ వంటి వ్యాధులను ఎదుర్కోవడంలో కీలకంగా వ్యవహరించిందని.. సరసమైన ధరలకు వ్యాక్సిన్‌లను అందిస్తూ సీఈవో అదార్ పూనావాలా తన నిబద్ధతను చాటుకున్నారని కొనియాడింది.

ఎంపిక ప్రక్రియను ఇలా

ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ప్రభావాలను చూపుతున్న కంపెనీలను TIME వార్షిక జాబితాలో పొందుపరుస్తారు. ఎంపిక ప్రక్రియలో తొలుత కంపెనీల నుంచి నామినేషన్‌లు స్వీకరిస్తారు. ప్రభావం, ఆవిష్కరణ, ఆశయం, విజయం వంటి కీలక అంశాలపై టైం మ్యాగజైన్ ఎడిటర్లు నివేదిక తయారు చేసి సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేస్తారు.

For Latest News and Business News click here

Updated Date - May 31 , 2024 | 11:26 AM

Advertising
Advertising