ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NSSO: గుడ్ న్యూస్.. పట్టణ ప్రాంతాల్లో తగ్గిన నిరుద్యోగిత రేటు.. ఎంతంటే?

ABN, Publish Date - May 16 , 2024 | 03:25 PM

నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు గురువారం ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు జనవరి-మార్చి మధ్య కాలంలో 6.7 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే సమయానికి ఈ రేటు 6.8 శాతంగా ఉండింది.

ఢిల్లీ: నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు గురువారం ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు జనవరి-మార్చి మధ్య కాలంలో 6.7 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే సమయానికి ఈ రేటు 6.8 శాతంగా ఉండింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ 2017 ఏప్రిల్‌లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS)ని ప్రారంభించింది.

ఈ సర్వే ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరం(FY23)లో మార్చి త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.8 శాతంగా ఉంది. అయితే ఇది గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికం, మూడో త్రైమాసికం (జులై-సెప్టెంబర్ 2023) రెండింటిలోనూ 6.6 శాతంగా నమోదైంది. 2023 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉంది. 2024 జనవరి-మార్చిలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల నిరుద్యోగిత రేటు 6.7 శాతంగా నమోదైంది.

స్త్రీలల్లో...

పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో నిరుద్యోగిత రేటు 2024 జనవరి-మార్చిలో 8.5 శాతానికి తగ్గిందని సర్వే వెల్లడించింది. 2023 ఏప్రిల్-జూన్ నెలలో నిరుద్యోగిత రేటు 9.1 శాతం ఉండగా, 2023 జులై-సెప్టెంబర్, అక్టోబర్-డిసెంబర్ రెండింటిలోనూ 8.6 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లోని పురుషులలో, నిరుద్యోగిత రేటు 2024 జనవరి-మార్చిలో 6.1 శాతానికి పెరిగింది.

ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే సమయానికి 6 శాతంగా ఉంది. ఇది 2023 ఏప్రిల్-జూన్‌లో 5.9 శాతం, జులై-సెప్టెంబర్‌లో 6 శాతం, అక్టోబర్-డిసెంబర్‌లో 5.8 శాతంగా నమోదైంది.


ముఖ్యాంశాలు..

  • 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల్లో జనవరి - మార్చి 2023 నుంచి జనవరి - మార్చి 2024 వరకు పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు (Unemployement Rate) 6.8 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది.

  • స్త్రీలల్లో నిరుద్యోగిత రేటు జనవరి - మార్చి 2023లో 9.2 శాతం నుంచి జనవరి - మార్చి 2024 నాటికి 8.5 శాతానికి తగ్గింది.

  • పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులకు జనవరి - మార్చి 2023 నుంచి జనవరి - మార్చి 2024 మధ్య కాలంలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR) వరుసగా 48.5 శాతం నుంచి 50.2 శాతానికి పెరిగింది.

  • పట్టణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు జనవరి - మార్చి 2023 నుంచి జనవరి - మార్చి 2024 వరకు 22.7 - 25.6 శాతానికి పెరిగింది.

  • మహిళా కార్మికుల జనాభా నిష్పత్తి జనవరి - మార్చి 2023 నుంచి 2024 జనవరి - మార్చి వరకు 20.6 శాతం నుండి 23.4 శాతానికి పెరిగింది.

For Latest News and Business News

Updated Date - May 16 , 2024 | 03:25 PM

Advertising
Advertising