Industries: 5.8 శాతం పెరిగిన పరిశ్రమల ఉత్పత్తి.. గతేడాది కంటే 0.6 శాతం అధికం
ABN, Publish Date - May 12 , 2024 | 04:21 PM
2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ పరిశ్రమల్లో ఉత్పత్తి 5.8 శాతం పెరిగినట్లు ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్టాటికల్ ఆఫీస్ డేటా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ పరిశ్రమల్లో ఉత్పత్తి 5.8 శాతం పెరిగినట్లు ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్టాటికల్ ఆఫీస్ డేటా వెల్లడించింది. ఒక్క మార్చి నెలలోనే ఏకంగా 4.9 శాతం ఉత్పత్తులు పెరిగాయని గతేడాది అదే సమయానికి కేవలం 1.9 శాతంగానే ఉత్పత్తులు జరిగాయని తేలింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5.2 శాతం ఉత్పత్తులు జరగ్గా.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 0.6 శాతం ఉత్పత్తులు పెరగడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మైనింగ్ ఉత్పత్తులు 1.2 శాతం, విద్యుత్తు ఉత్పత్తులు 8.6 శాతం పెరిగాయి.
ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్(IIP)లో గత ఆర్థిక సంవత్సరంలో 5.2 వృద్ధి శాతం నమోదు చేయగా, 2023-24లో అత్యధికంగా 5.8 వృద్ధి నమోదైంది.
ఇది కూడా చదవండి:
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మళ్లీ చైనా కంపెనీలదే హవా
గ్రామ స్థాయికి బీమా సేవల విస్తరణ
Read Latest Business News and Telugu News
Updated Date - May 12 , 2024 | 04:21 PM