ఇంట్రాడే లాభాలు ఆవిరి
ABN, Publish Date - Dec 25 , 2024 | 04:44 AM
ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి. ఇంట్రాడే లాభాలను చేజార్చుకున్న సూచీలు చివరికి స్వల్ప నష్టాల్లో ముగిశాయి...
ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి. ఇంట్రాడే లాభాలను చేజార్చుకున్న సూచీలు చివరికి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 67.30 పాయింట్లు కోల్పోయి 78,472.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 25.80 పాయింట్లు తగ్గి 23,727.65 వద్దకు జారుకుంది. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిన నేపథ్యంలో మదుపరులు మెటల్, విద్యుత్ రంగ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడట ఇందుకు కారణమైంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో సగం నష్టపోయాయి.
రూపాయి మరింత పతనం: భారత కరెన్సీ సరికొత్త కనిష్ఠానికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 4 పైసలు క్షీణించి రూ.85.15 వద్ద ముగిసింది. ట్రంప్ సుంకాల వడ్డన భయాల నేపథ్యంలో దిగుమతిదారుల నుంచి డాలర్‌కు గిరాకీ పెరగడంతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లో నష్టాలు ఇందుకు కారణమయ్యాయి.
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ భారీ ఐపీఓ: విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ కూడా పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.1,000 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ప్రమోటర్ గ్రీవ్స్ కాటన్ సహా ఇతర వాటాదారులకు చెందిన 18.9 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) పద్ధతిన విక్రయించనుంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ‘ఆంపియర్’ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు గ్రీవ్స్ బ్రాండ్‌నేమ్‌తో త్రిచక్ర వాహనాలను విక్రయిస్తోంది. ఈ కంపెనీ తెలంగాణలోని తూప్రాన్‌తో పాటు తమిళనాడులోని రాణిపేట్, ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ప్లాంట్లను కలిగి ఉంది.
సెన్సెక్స్ 67 పాయింట్లు డౌన్
నేడు మార్కెట్లకు సెలవు
క్రిస్మస్ సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలైన బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలకు బుధవారం సెలవు ప్రకటించారు. కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు కూడా పనిచేయవు. గురువారం మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.
Updated Date - Dec 25 , 2024 | 04:44 AM