Investment Tips: ఈ పోస్టాఫీస్ స్కీంలో రూ. 10 లక్షలు పెడితే.. వచ్చేది రూ. 21 లక్షలు..
ABN, Publish Date - Oct 25 , 2024 | 10:00 AM
బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసులో కూడా అనేక మంది పెట్టుబడులు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే దీనిలో పెట్టుబడులు 100 శాతం సేఫ్ అని చెప్పవచ్చు. అయితే దీనిలో ఓ స్కీంలో రూ. 10 లక్షలు పెట్టుబడి చేస్తే మీకు మొత్తం రూ. 21 లక్షలు లభిస్తాయి. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చుద్దాం.
సురక్షితమైన పెట్టుబడులకు (Investments) పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) స్కీం బెస్ట్ అని చెప్పవచ్చు. దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు. 100 శాతం మనం పెట్టిన మొత్తం వడ్డీతో సహా వస్తుందనే నమ్మకం ఉంటుంది. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది కాబట్టి అనేక మంది వీటివైపు మొగ్గుచూపుతున్నారు. బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులలో కూడా వివిధ సంవత్సరాలకు FD ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఒక సంవత్సరం FDపై 6.9 శాతం, రెండు సంవత్సరాల ఎఫ్‌డీపై 7.0 శాతం, 3 సంవత్సరాలకు 7.1 శాతం, 5 సంవత్సరాలపైన ఉన్న మొత్తాలకు 7.5 శాతం వడ్డీని అందిస్తున్నారు.
పన్ను ప్రయోజనం కూడా..
ఈ పొదుపు పథకంలో మీరు పెట్టుబడిని కనీసం రూ. 1000తో కూడా ప్రారంభించవచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. పోస్టాఫీసులో 5 సంవత్సరాల పాటు చేసిన పెట్టుబడులకు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ప్రయోజనాలను పొందుతారు. ఈ క్రమంలో స్కీం కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ పథకంలో పెట్టుబడి పెడితే, మీరు పెట్టుబడి చేసిన మొత్తం కంటే డబుల్ సంపాదించవచ్చు. దీని కోసం ఎంత సేవ్ చేయాలి, ఎన్ని సంవత్సరాల పాటు పెట్టుబడి చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రెట్టింపు మొత్తం
పోస్ట్ ఆఫీస్ FD పథకంలో మీ మొత్తాన్ని రెండు రెట్లు పెంచుకోవడానికి మీరు 5 సంవత్సరాల FDని ఎంచుకోవాలి. ఈ నేపథ్యంలో మీరు ఈ స్కీమ్‌లో 10 లక్షల రూపాయలు పెట్టుబడి చేస్తే మీరు 7.5 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాలలో ఈ మొత్తంపై రూ. 4,49,948 వడ్డీని పొందుతారు. ఇలా మొత్తం రూ. 14,49,948 అవుతుంది. ఆ క్రమంలో మీరు ఈ పథకాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగిస్తే, మీరు రూ. 11,02,349 వడ్డీని పొందుతారు. అంటే 10 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే మొత్తం రూ. 21,02,349 అవుతుంది. ఈ క్రమంలో మీరు పెట్టుబడి చేసిన మొత్తంపై రెట్టింపు మొత్తాన్ని పొందుతారు.
పొడిగింపు రూల్స్ ఏంటి?
ఒక సంవత్సరం పోస్ట్ ఆఫీస్ FD స్కీం మెచ్యూరిటీ తేదీ నుంచి 6 నెలలలోపు, 2 సంవత్సరాల FD మెచ్యూరిటీ వ్యవధి నుంచి 12 నెలలలోపు, 3, 5 సంవత్సరాల FD మెచ్యూరిటీ వ్యవధి నుంచి 18 నెలలలోపు పొడిగించబడుతుంది. ఇది కాకుండా మీరు ఖాతాను తెరిచేటప్పుడు మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగింపు కోసం కూడా అభ్యర్థించవచ్చు. మెచ్యూరిటీ తేదీలో సంబంధిత ఖాతాకు వర్తించే వడ్డీ రేటు గ్రేస్ పీరియడ్‌కు వర్తిస్తుంది.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..
Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..
Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News
Updated Date - Oct 25 , 2024 | 10:02 AM