Alert: దాల్ చావల్‌కు కట్టుబడి ఉండాలి.. ఇన్వెస్టర్లను హెచ్చరించిన రాధికా గుప్తా
ABN, Publish Date - Sep 06 , 2024 | 09:29 PM
పెట్టుబడిదారులకు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే ఆశ ఉండకూడదని Edelweiss మ్యూచువల్ ఫండ్ CEO, MD రాధికా గుప్తా అన్నారు. ఇటివల అసోంలో బయటపడిన రూ.2,200 కోట్ల స్టాక్ మార్కెట్ పెట్టుబడుల స్కాం గురించి ప్రస్తావించిన క్రమంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కీలక సూచనలు చేశారు.
ఇటివల స్టాక్ మార్కెట్(stock market)లో పెట్టుబడుల పేరుతో ఓ 22 ఏళ్ల వ్యక్తి రూ.2,200 కోట్ల స్కాం చేశాడు. ఈ కుంభకోణానికి సంబంధించి అసోం పోలీసులు గౌహతికి చెందిన విశాల్ ఫుకాన్, స్వప్నిల్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిద్దరూ పెట్టుబడులపై 60 రోజుల్లోగా 30 శాతం రాబడి ఇస్తామని హామీ ఇచ్చి అమాయక పెట్టుబడిదారులను ఆకర్షించి మోసం చేశారు. ఈ అంశంపై తాజాగా Edelweiss మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ రాధికా గుప్తా స్పందించారు. పెట్టుబడిదారులు రాత్రికి రాత్రే తమ అదృష్టాలు మారతాయని ఆశించకుండా 'దాల్-రైస్'కు కట్టుబడి ఉండాలని పెట్టుబడి దారులకు సూచించారు.
ఈజీ మనీ
అసోంలో వెలుగు చూసిన రూ.2,200 కోట్ల వ్యాపార కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ గుప్తా ఈ విషయాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. డబ్బు సంపాదించడానికి అత్యంత ఈజీ మార్గం లేదని గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. సాధారణంగా అలాంటి మార్గాన్ని ఫ్యాన్సీ కార్లతో ప్రచారం చేస్తే.. అది చివరకు ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు సురక్షితంగా ఉండాలని, పప్పులు, బియ్యానికి కట్టుబడి ఉండి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలని హితవు పలికారు. ఇవి ప్రభావవంతంగా అజీర్ణం లేకుండా ఆరోగ్యకరమైనవని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఫండ్లలో
అంతేకాదు మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక రంగంపై మాత్రమే దృష్టి సారించే అనేక ఫండ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని రాధికా గుప్తా పెట్టుబడిదారులకు సూచించారు. ఏ ఒక్క రంగానికి పరిమితం కానీ పప్పులు, బియ్యం వంటి ఫండ్‌లలో పెట్టుబడులు చేయాలన్నారు. ఇటువంటి ఫండ్‌లు అస్థిర పరిస్థితుల మధ్య కూడా స్థిరమైన రాబడులను అందిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
గ్రూపుల్లో
మరోవైపు ఇటివల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో అనేక మందికి ఈజీగా రాబడులు పొందవచ్చని పలువురు మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ట్రేడింగ్ టిప్స్ చెప్తామని, వారం రోజుల్లో మీ పెట్టుబడులు డబుల్ అవుతాయని ఇలా అనేక మందిని మభ్యపెట్టి వారి డబ్బులను లూటీ చేసిన ఘటనలు కూడా బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుల పేరుతో ఎవరైనా మీమ్మల్ని ప్రలోభ పెడితే చాలా జాగ్రత్తగా ఉండాలని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Fire Accident: స్కూల్ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది విద్యార్థులు సజీవ దహనం
BSNL: జియో, ఎయిర్‌టెల్ కట్టడికి బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్.. టాటా సపోర్ట్‌తో ఇక..
Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..
Read MoreBusiness News and Latest Telugu News
Updated Date - Sep 06 , 2024 | 09:47 PM