Stock Market: సెన్సెక్స్ ఢమాల్..రూ.4.33 లక్షల కోట్లు కోల్పోయిన మదుపర్లు
ABN, Publish Date - Jan 17 , 2024 | 04:40 PM
భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు దాదాపు కుప్పకూలాయి. బీఎస్‌ఇ సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతానికి పైగా క్షీణతతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1628.01 పాయింట్లు లేదా 2.23 శాతం పతనంతో 71500.76 వద్ద, నిఫ్టీ 460.35 పాయింట్లు లేదా 2.09 శాతం పతనంతో 21571.95 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలో బుధవారం సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్‌ఇ సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతానికి పైగా క్షీణతతో ముగిశాయి. దీంతో స్టాక్ మార్కెట్ స్టాంపేడ్‌లో బీఎస్‌ఇలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4.33 లక్షల కోట్లు తగ్గింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: వచ్చే పదేళ్లలో ట్రిలియనీర్
మార్కెట్ క్షీణత కారణంగా ఈరోజు ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు. ఈ క్రమంలో ఈరోజు ఇన్వెస్టర్లు రూ.4 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్లు రూ.5.67 లక్షల కోట్లు కోల్పోయారు. సెన్సెక్స్ 1628.01 పాయింట్లు లేదా 2.23 శాతం పతనంతో 71500.76 వద్ద ముగియగా, నిఫ్టీ 460.35 పాయింట్లు లేదా 2.09 శాతం పతనంతో 21571.95 వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా ఏకంగా 2061 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ కూడా 516 పాయింట్లు నష్టపోయింది.
సెన్సెక్స్‌లో 30 షేర్లు జాబితా చేయబడ్డాయి. వాటిలో 6 మాత్రమే ఈ రోజు గ్రీన్ జోన్‌లో ముగిశాయి. ఈరోజు హెచ్‌సీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, LT మైండ్‌ట్రీ, SBI లైఫ్, TCSలలో అత్యధిక పెరుగుదల నమోదైంది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, హిందాల్కో షేర్లు ఈరోజు అతిపెద్ద క్షీణతను చవిచూశాయి. బలహీన ఫలితాల తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భారీ పతనం మార్కెట్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అంతకుముందు మంగళవారం సెన్సెక్స్ 199 పాయింట్లు నష్టపోయి 73,128 వద్ద ముగిసింది.
Updated Date - Jan 17 , 2024 | 05:01 PM